Patna : ముస్లిం యువతితో స్నేహంగా ఉన్నాడని హిందూ కుర్రాడిని దారుణంగా కొట్టేసారు

హిందూ అబ్బాయి.. ముస్లిం అమ్మాయి సన్నిహితంగా ఉన్నారంటూ కొందరు ముస్లిం యువకులు హిందూ కుర్రాడిపై దాడికి తెగబడ్డారు. బండిపై వెళ్తున్న ఇద్దర్నీ ఆపి అబ్బాయిని చితకబాదారు. పాట్నాలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపుతోంది.

Patna : ముస్లిం యువతితో స్నేహంగా ఉన్నాడని హిందూ కుర్రాడిని దారుణంగా కొట్టేసారు

Patna

Hindu boy crushed by Muslims : ముస్లిం అమ్మాయితో స్నేహంగా ఉన్నాడని ఓ హిందూ కుర్రాడిని ముస్లింలు యువకులు నానా మాటలు అన్నారు. దాడి చేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటనను చూస్తూ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారనే విమర్శలు వస్తున్నాయి.

హిందువులపై యుద్ధం…కేరళ టూరిజం బీఫ్ ట్వీట్ పై నెటిజన్లు ఫైర్

పాట్నా బీహార్‌లో ముస్లిం యువతితో స్నేహంగా ఉన్నాడని ఓ హిందూ కుర్రాడిపై ముస్లిం యువకులు దాడికి తెగబడ్డ సంఘటన సంచలనం రేపుతోంది. ఇద్దరూ కలిసి బైక్ మీద వెళ్తుండగా వారి వెంట పడి బైక్‌ని ఆపి ఆ కుర్రాడిని నానా దుర్భాషలాడారు. అక్కడితో ఆగకుండా దారుణంగా చితకబాదారు. ముస్లిం యువతి అతను నా క్లాస్మేట్ అని చెబుతూ ఆపడానికి ప్రయత్నించినా వారు ఆగలేదు. ఆమెను అక్కడి నుంచి ఇంటికి వెళ్లమని చెప్పారు. ఈ ఘటనకు మొత్తం వీడియో తీసిన ముస్లిం యువకులు ట్విట్టర్‌లో పోస్ట్ చేసి బెదిరించినట్లుగా కూడా తెలుస్తోంది.

Communal Violence: హిందువులపై హింస.. తాలిబాన్ల హస్తం.. ప్రభుత్వాన్ని పడగొట్టడానికే!

ఈ సంఘటన పాట్నా ప్రధాన మార్కెట్‌లో పోలీసు సిబ్బంది చూస్తుండగా జరిగినట్లు స్ధానికులు చెబుతున్నారు. అయితే ఈ దాడిని ఆపేందుకు ఏ మాత్రం వారు ప్రయత్నం చేయలేదని.. పోలీసులు కేవలం ప్రేక్షకుల్లా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి.