Nagarjuna: ది ఘోస్ట్ – దుబాయ్‌లో ముగించేసిన నాగ్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన రీసెంట్ మూవీ ‘బంగార్రాజు’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య.....

Nagarjuna: ది ఘోస్ట్ – దుబాయ్‌లో ముగించేసిన నాగ్!

Nagarjuna Wraps Dubai Schedule Of The Ghost

Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన రీసెంట్ మూవీ ‘బంగార్రాజు’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కూడా నటించడంతో ఈ సినిమా మల్టీస్టారర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చి వారిని అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా తరువాత నాగార్జున తన నెక్ట్స్ చిత్రాన్ని ఇప్పటికే ప్రారంభించాడు. కాగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో నాగ్ ‘ది ఘోస్ట్’ అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Nagarjuna : నాగార్జున ‘ఘోస్ట్’ మూవీ మేకింగ్

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండటంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కోసం దుబాయ్ వెళ్లారు చిత్ర యూనిట్. ఇక ఔట్ అండ్ ఔట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో నాగ్ ఓ పవర్‌ఫుల్ ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా దుబాయ్ షెడ్యూల్‌ను ముగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగ్‌తో పాటు సోనాల్ చౌహన్ కూడా ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. వీరిద్దరు కలిసి నడిచివస్తున్న ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఇక పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లతో రానున్న ఈ సినిమాలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కూడా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్‌లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ‘ది ఘోస్ట్’ చిత్రంతో నాగార్జున ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.