Terror Threat: ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం

కొన్ని రోజులుగా నాగపూర్ లో "జైషే ఇ ముహమ్మద్" ఉగ్రవాదులు తిష్టవేశారన్న నిఘావర్గాల హెచ్చరికల మేరకు నాగపూర్ వ్యాప్తంగా అలెర్ట్ ప్రకటించారు

Terror Threat: ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం

Secure

Terror Threat: నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. గత కొన్ని రోజులుగా నాగపూర్ లో “జైషే ఇ ముహమ్మద్” ఉగ్రవాదులు తిష్టవేశారన్న నిఘావర్గాల హెచ్చరికల మేరకు నాగపూర్ వ్యాప్తంగా అలెర్ట్ ప్రకటించారు. ఈక్రమంలో నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్, హెడ్గేవార్ భవన్ సహా ఇతర పర్యాటక ప్రాంతాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిఘావర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు, ఇతర సున్నిత ప్రాంతాల్లో భద్రతను పెంచినట్లు నాగపూర్ పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ వెల్లడించారు.

Also read: Corona Vaccination: కరోనా ప్రికాషన్ డోస్ అపాయింట్మెంట్లు ప్రారంభం

గతంలోనే నాగపూర్ చేరుకున్న “జైషే ఇ ముహమ్మద్” ఉగ్రవాదులు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం సహా ఇతర ముఖ్య ప్రాంతాల్లో విధ్వంసానికి వ్యూహరచన చేశారని, ఈమేరకు గత కొన్ని రోజులుగా ఆయా ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. జనవరి 1న ముంబై మహానగరంలోనూ విధ్వంసం సృష్టించేందుకు ఖలిస్తాన్ ఉగ్రవాదులు కుట్రలు పన్నారన్న సమాచారంతో ముంబై పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం మరోసారి ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో మహారాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కేంద్ర బలగాల సహాయంతో ఉగ్రజాడలను కనిపెట్టేందుకు ఆ రాష్ట్ర పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Also read: Sonu Sood: ఎన్నికల సంఘం ప్రచారకర్తగా తప్పుకున్న సోనూసూద్