Delhi liquor scam: ఛార్జిషీట్లో సంజయ్ సింగ్ పేరు పొరపాటుగా పడిందన్న ఈడీ.. లిక్కర్ స్కాం జరగలేదని రుజువైందన్న కేజ్రీవాల్

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం నగదు అక్రమ చలామణీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Delhi liquor scam: ఛార్జిషీట్లో సంజయ్ సింగ్ పేరు పొరపాటుగా పడిందన్న ఈడీ.. లిక్కర్ స్కాం జరగలేదని రుజువైందన్న కేజ్రీవాల్

Delhi liquor scam

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi liquor scam) కేసులో మనీలాండరింగ్ పై విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED).. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత సంజయ్ సింగ్ (Sanjay Singh)కు క్షమాపణలు చెప్పింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ అంశంలో ఈడీ తన పేరును ఛార్జిషీట్లో పేర్కొనడంపై సంజయ్ సింగ్ ఈడీకి లీగల్ నోటీసులు పంపారు.

ఛార్జిషీట్లో ఈడీ తన పేరును ఇరికించిందని, అసత్య ప్రచారం చేసిందని లీగల్ నోటీసులో సంజయ్ సింగ్ పేర్కొన్నారు. తనకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. దీంతో సంజయ్ సింగ్ కు ఈడీ వివరణ ఇచ్చింది. టైపోగ్రాఫికల్/క్లరికల్ లోపం జరిగిందని, అనుకోకుండా ఇది జరిగిందని వివరించింది.

రాహుల్ సింగ్ కి బదులుగా ‘సంజయ్ సింగ్’ అని పడిందని చెప్పింది. మరోవైపు దీనిపై సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందించారు. ఛార్జిషీట్లో ఎవరి పేరైనా పొరపాటుగా పడుతుందా అని నిలదీశారు. ఈ కేసు మొత్తం నకిలీదని రుజువైందని చెప్పారు.

దేశంలోని అత్యంత నిజాయితీగల పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రధాని మోదీ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తమ ఎదురుదల ఓర్వలేక ఇటువంటి పనులు చేస్తున్నారని చెప్పారు. కాగా, ఢిల్లీలో అసలు లిక్కర్ స్కామ్ జరగలేదని, తమపై బీజేపీ కావాలనే బురదచల్లే ప్రయత్నం చేస్తోందని కేజ్రీవాల్ మొదటి నుంచీ అంటున్నారు.

Delhi liquor scam: మనీలాండరింగ్, హవాలా వ్యవహారాల్లో కల్వకుంట్ల కవిత కీలకం: చార్జిషీట్లో ఈడీ