Dasara Movie : దసరా రిలీజ్ కూడా సరికొత్త రికార్డు.. అమెరికాలో భారీగా..

నానికి అమెరికాలో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇప్పటివరకు నాని ఏడు సినిమాలు అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించాయి. స్టార్ హీరోలకు సమానంగా అమెరికాలో నానికి కలెక్షన్స్ వస్తాయి. తాజాగా దసరా సినిమాని పాన్ ఇండియా వైడ్................

Dasara Movie : దసరా రిలీజ్ కూడా సరికొత్త రికార్డు.. అమెరికాలో భారీగా..

Nani Dasara Movie grand releasing in America

Updated On : March 18, 2023 / 1:22 PM IST

Dasara Movie :  న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా సినిమాతో రాబోతున్నాడు. మార్చ్ 30న దసరా సినిమా రిలీజ్ కాబోతుంది. మొదటి సారి నాని పూర్తి మాస్ లుక్ లో కనపడుతుండటం, ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్స్ అదరగొట్టేయడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నాని. దసరా సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాబోతుండటంతో ప్రమోషన్స్ తో ఇండియా వైడ్ బిజీగా ఉన్నాడు నాని.

నానికి అమెరికాలో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇప్పటివరకు నాని ఏడు సినిమాలు అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించాయి. స్టార్ హీరోలకు సమానంగా అమెరికాలో నానికి కలెక్షన్స్ వస్తాయి. తాజాగా దసరా సినిమాని పాన్ ఇండియా వైడ్ భారీగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అమెరికాలో కూడా ఈ సినిమాని భారీగా రిలీజ్ చేయబోతున్నారు. అమెరికాలో నాని దసరా సినిమా 600 స్క్రీన్స్ లో కేవలం తెలుగులోనే రిలీజ్ అవుతుంది. ఇండియన్ సినిమాల్లో ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజయిన మూడో సినిమాగా దసరా రికార్డ్ కొట్టబోతుంది. ఇది కేవలం తెలుగు స్క్రీన్స్ మాత్రమే. తమిళ్, హిందీ భాషలతో మరికొన్ని స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతుంది దసరా సినిమా. అమెరికాలో ప్రత్యంగిర సినిమాద్ దసరా సినిమాని రిలీజ్ చేస్తుంది. అమెరికాలో మార్చ్ 29నే ప్రీమియర్ షోలు వేయబోతున్నారు.

Kareena Kapoor : నాటు నాటు పాట పెడితేనే నా కొడుకు అన్నం తింటున్నాడు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇక దసరా సినిమా కూడా అమెరికాలో ఈజీగా 1 మిలియన్ డాలర్స్ మార్క్ దాటేసి నానికి ఎనిమిదో సినిమాగా జత చేరుతుంది అని అంటున్నారు అభిమానులు. ఈ సినిమా కోసం నాని అభిమానులు, ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.