Nasal Vaccine: నేటి నుంచి నాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి.. అనుమతించిన కేంద్రం

ఇంజెక్షన్లు తీసుకోవడం అంటే భయపడేవాళ్లకు, సూదుల నొప్పి భరించలేం అనుకునే వాళ్లకు గుడ్ న్యూస్. మన దేశంలో నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అంటే ముక్కు ద్వారానే కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తారు.

Nasal Vaccine: నేటి నుంచి నాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి.. అనుమతించిన కేంద్రం

Nasal Vaccine: దేశంలో నేటి నుంచి నాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌కు కేంద్రం అనుమతించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ వెల్లడించారు. నాసల్ వ్యాక్సిన్ కావాల్సిన వాళ్లు కోవిన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

Soldiers Killed: లోయలో పడ్డ సైనిక వాహనం.. 16 మంది భారత సైనికులు మృతి

కోవాగ్జిన్ రూపొందించిన భారత్ బయోటెక్ సంస్థే దీన్ని కూడా తయారు చేసింది. దీని పేరు బీబీవీ154 లేదా ఇన్కోవాక్. ఈ రోజు నుంచి ఈ నాసల్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. 18 సంవత్సరాలు దాటిన వాళ్లెవరైనా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ బూస్టర్ డోసుగా తీసుకోవచ్చని సంస్థ తెలిపింది. గతంలో కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ వంటి ఏ వ్యాక్సిన్ తీసుకున్నాసరే ఇప్పుడు నాసల్ వ్యాక్సిన్‌ను బూస్టర్ డోసుగా తీసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ ముందుగా ప్రైవేటు హాస్పిటల్స్, హెల్త్ సెంటర్స్‌లో అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వ సంస్థల ద్వారా కూడా పంపిణీ జరుగుతుంది. ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్ దేశంలో రూపొందడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఉన్న వ్యాక్సిన్లు అన్నీ ఇంజెక్షన్ రూపంలో తీసుకునేవే.

UP: ‘చెడు నుంచి కాపాడు అల్లా’ అంటూ మార్నింగ్ ప్రేయర్ చేసిన విద్యార్థులు.. స్కూలు ప్రిన్సిపాల్ సస్పెండ్

ఇంజెక్షన్లు అంటే భయపడేవాళ్లు, సూదుల నొప్పి భరించలేం అనుకునేవాళ్లు ఈ నాసల్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ప్రస్తుతం కోవిన్ పోర్టల్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్, కోవోవాక్స్, స్పుత్నిక్ వి, కార్బెవాక్స్ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పటి నుంచో బూస్టర్ డోసుల్ని కూడా ఉచితంగా అందిస్తున్నప్పటికీ, చాలా మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. అయితే, ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్నందున మళ్లీ ప్రజలు బూస్టర్ డోసులపై ఆసక్తి చూపే అవకాశం ఉంది.