Nayan-Vignesh : నయన్-విగ్నేష్ వెడ్డింగ్​ ఇన్విటేషన్​ వీడియో ఇదేనా??

ఇదే నయన్​-విఘ్నేష్​ వెడ్డింగ్​ ఇన్విటేషన్​ వీడియో అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఒక యానిమేటేడ్ వీడియో. ఇందులో వధువు, వరుడు సాంప్రదాయ దుస్తులు ధరించి...................

Nayan-Vignesh : నయన్-విగ్నేష్ వెడ్డింగ్​ ఇన్విటేషన్​ వీడియో ఇదేనా??

Nayan Vignesh

Nayan-Vignesh :  లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి గుళ్ళు, గోపురాలు, వెకేషన్స్, విజిటింగ్ ప్లేసులు.. అన్ని చోట్లకి చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు గత కొంతకాలంగా. గతంలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్న వీళ్ళు పెళ్లి మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో వీరి పెళ్లి మీద అనేక రకాల వార్తలు వచ్చాయి. చివరగా వీరి పెళ్లి జూన్ 9న జరగనుందని క్లారిటీ వచ్చింది.

ఇటీవల నయన్-విగ్నేష్ కలిసి అధికారికంగా తమిళనాడు సీఎం స్టాలిన్ వద్దకు వెళ్లి తమ పెళ్ళికి కూడా ఆహ్వానించారు. వీరి పెళ్లి మహాబలిపురం ఓ ప్రైవేట్ హోటల్ లో జూన్ 9న ఉదయం జరగనుంది. ప్రస్తుతం ఇద్దరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఇదే నయన్​-విఘ్నేష్​ వెడ్డింగ్​ ఇన్విటేషన్​ వీడియో అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Prithviraj Sukumaran : హీరోగా, డైరెక్టర్‌గా వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న మలయాళం స్టార్ హీరో.. టాలీవుడ్‌కి ఇతనే దిక్కు అవుతున్నాడు..

ఇది ఒక యానిమేటేడ్ వీడియో. ఇందులో వధువు, వరుడు సాంప్రదాయ దుస్తులు ధరించి ఒక గుడిలోకి కలిసి నడుస్తున్నట్లుగా చూపించారు. ఇందులో నయనతార, విఘ్నేష్​ తల్లిదండ్రుల పేర్లు, పెళ్లి తేది, జరిగే సమయం, పెళ్లి వేదికను ఇలా అన్ని డీటెయిల్స్ ని ఇచ్చారు. అయితే ఈ వీడియో అధికారికంగా వచ్చింది కాదు, ఫ్యాన్స్ చేసింది అని చాలామంది అంటున్నారు. ఏదైతేనేమి నయన్ – విగ్నేష్ పెళ్లి ఇన్విటేషన్ వీడియో మాత్రం వైరల్ గా మారింది. అభిమానులంతా పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. వీరి పెళ్ళికి పలువురు సౌత్ సెలబ్రిటీలు రానున్నారు.