Covid-19: ఉధృతంగా కోవిడ్ వ్యాప్తి.. ఒక్క రోజులోనే 40 శాతం పెరిగిన కేసులు

దేశంలో ఇటీవలి కాలంలో మళ్లీ కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులోనే 40 శాతం కేసులు పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,233 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Covid-19: ఉధృతంగా కోవిడ్ వ్యాప్తి.. ఒక్క రోజులోనే 40 శాతం పెరిగిన కేసులు

Covid 19

Covid-19: దేశంలో ఇటీవలి కాలంలో మళ్లీ కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులోనే 40 శాతం కేసులు పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,233 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఏడుగురు మరణించారు. ఈ ఏడాది మార్చి తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 28,857. యాక్టివ్ కేసుల శాతం 0.07. దేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన రోగుల సంఖ్య 4,31,90,282. మొత్తం 5,24,715 మంది కరోనాతో మరణించారు.

Cheetah: భారత్‌ రానున్న చీతాలు.. 70 ఏళ్ల తర్వాత తొలిసారి

కరోనా రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది. మంగళవారం రోజు కరోనా నుంచి 3,345 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో కోలుకున్న వారి సంఖ్య 4,26,36,710. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమై ఇప్పటికి 509 రోజులు అవుతోంది. ప్రజలకు మొత్తం 194.43 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది. మంగళవారం రోజు 14,94,086 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. మహారాష్ట్రలో కేసుల పెరుగుదల శాతం ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో నిన్న 1,881 కరోనా కేసులు నమోదయ్యాయి. ముంబైలోనే 1,242 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 450, తమిళనాడులో 144, పశ్చిమ బెంగాల్‌లో 61 కేసులు నమోదయ్యాయి.