Telangana: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మద్యం అమ్మకాలపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రిటైల్ షాపుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు, 2బీ లైసెన్స్ గల బార్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు.

Telangana: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మద్యం అమ్మకాలపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

Telangana: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31న అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు చేసేందుకు అనుమతించింది. బార్స్, పబ్స్, లిక్కర్ షాప్స్ అర్థరాత్రి వరకు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

Election Commission: ఎక్కడినుంచైనా ఓటేయొచ్చు.. రిమోట్ ఈవీఎం మెషీన్లు సిద్ధం చేస్తున్న ఎన్నికల సంఘం

డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రిటైల్ షాపుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు, 2బీ లైసెన్స్ గల బార్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. గతంలో రెండేళ్లుగా కరోనా సమయంలో న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం అమ్మకాలు నిలిచిపోయి, వ్యాపారులు నష్టపోయారని, అందువల్ల ఈ వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ తాజా ఆదేశాలతో మందు షాపులు, బార్లు, పబ్బుల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే మందు తప్పనిసరిగా ఉండాల్సిందే.

సాధారణంగా ఇలాంటి సందర్భంలో ఒక గంట మాత్రమే అదనంగా మద్యం విక్రయాలు జరిపేందుకు అనుమతిస్తారు. అయితే, ఈ సారి మాత్రం అర్ధరాత్రి వరకు మద్యం అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతించడం విశేషం. ఈ లెక్కన ఈ సారి డిసెంబర్ 31న మద్యం విక్రయాలు ఊహించని స్థాయిలో జరిగే అవకాశం ఉంది.