Karthikeya2: కార్తికేయ-2 వెనక్కి వెళ్తున్నాడా..?

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ-2 ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను జూలై 22న.....

Karthikeya2: కార్తికేయ-2 వెనక్కి వెళ్తున్నాడా..?

Nikhil Karthikeya 2 Release To Get Postponed

Karthikeya 2: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ-2 ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను జూలై 22న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఈ సినిమాను జూలై 22న థియేటర్లలో చూసేందుకు ఆడియెన్స్ రెడీ అవుతున్న తరుణంలో చిత్ర యూనిట్ వారికి ఓ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Karthikeya2: కార్తికేయ-2 ఫస్ట్ లుక్ పోస్టర్ రెడీ..!

జూలై 22న ఎలాంటి పోటీ లేకుండా సోలో రిలీజ్‌గా కార్తికేయ-2 చిత్రం రావాలని చూస్తోంది. అయితే ఈ సినిమాకు పోటీగా ఇప్పుడు మరో యంగ్ హీరో మూవీ కూడా బరిలోకి వచ్చింది. అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘థ్యాంక్యూ’ను తొలుత జూలై 8న రిలీజ్ చేయాలని దర్శకుడు విక్రమ్ కుమార్ అండ్ టీమ్ భావించారు. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న దానికంటే ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమా రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేసి జూలై 22న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. దీంతో కార్తికేయ-2 చిత్రానికి బాక్సాఫీస్ వద్ద పోటీ తప్పడం లేదు.

‘కార్తికేయ 2’ షూటింగ్‌‌లో ప్రమాదం.. నిఖిల్‌కు గాయాలు..

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బాక్సాఫీస్ వద్ద పోటీ మంచిది కాదని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కార్తికేయ-2 చిత్ర యూనిట్‌కు చెప్పడంతో, వారు తమ రిలీజ్ డేట్‌ను వాయిదా వేయాలని చూస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాను ఆగస్టు నెలలో రిలీజ్ చేసేందుకు కార్తికేయ-2 టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.