Nikhil Siddhartha : అమిత్ షా నన్ను పిలిచారు.. రాజకీయం చేస్తారనే నేను కలవలేదు..

ఓ మీడియా ప్రతినిధి.. మొన్న కార్తికేయ 2, ఇప్పుడు స్పై.. మీరు ఓ పార్టీకి అనుకూలంగా ఈ సినిమాలు తీస్తున్నారా? అమిత్ షా మిమ్మల్ని కలవాలని పిలిచారంట అని అడిగారు. దీనికి నిఖిల్ సమాధానమిస్తూ..

Nikhil Siddhartha : అమిత్ షా నన్ను పిలిచారు.. రాజకీయం చేస్తారనే నేను కలవలేదు..

Nikhil Siddhartha comments on Amit Shah

Spy Teaser Press Meet :  కార్తికేయ 2(Karthikeya 2), 18 పేజెస్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు నిఖిల్ సిద్దార్థ(Nikhil Siddhartha). ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమా ‘స్పై’ తో రాబోతున్నాడు. ఐశ్వర్య మీనన్(Iswarya Menon) హీరోయిన్ గా, ఎడిటర్ గ్యారీ దర్శకుడిగా ఈ సినిమా భారీగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఈ సినిమా. నిఖిల్ ‘స్పై’(SPY) సినిమా జూన్ 29న పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సినిమా సుభాష్ చంద్రబోస్(Subhas Chandrabose) మరణం వెనుక ఉన్న రహస్యాలు ఆధారంగా తెరకెక్కించినట్టు సమాచారం. దీంతో ‘స్పై’ టీజర్ ను మే 15న దేశ రాజధాని ఢిల్లీలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఉండే కర్తవ్యపథ్ దగ్గర విడుదల చేశారు. స్పై టీజర్ కు మంచి స్పందన వచ్చింది. టీజర్ చూశాక సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. తాజాగా చిత్రయూనిట్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించగా సినిమా గురించి అనేక విషయాలు తెలిపారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలిచ్చారు.

Jigarthanda Doublex : హరీష్ శంకర్‌కి ఛాన్స్ ఇవ్వకుండా తెలుగులో కూడా రిలీజ్ చేసేస్తున్నారు..

ఈ నేపథ్యంలో ఓ మీడియా ప్రతినిధి.. మొన్న కార్తికేయ 2, ఇప్పుడు స్పై.. మీరు ఓ పార్టీకి అనుకూలంగా ఈ సినిమాలు తీస్తున్నారా? అమిత్ షా మిమ్మల్ని కలవాలని పిలిచారంట అని అడిగారు. దీనికి నిఖిల్ సమాధానమిస్తూ.. ఇది సుభాష్ చంద్రబోస్ గారి సినిమా. కార్తికేయ కృష్ణుడికి సంబంధించింది. నేను చిన్నప్పటి నుంచి కృష్ణుడిని పూజిస్తాను కాబట్టి ఆ స్టోరీ చేశాను. ఇక నాకు వచ్చిన కథల్లో ఈ కథ బాగా నచ్చి సెలెక్ట్ చేసుకున్నాను. నేను చిన్నప్పుడే సుభాష్ చంద్రబోస్ గెటప్స్ వేసాను. నా ధర్మాన్ని నేను నమ్ముతాను. నేను ఇండియన్ ని, ఇది ఇండియన్ సినిమా. నాకు సినిమాలు చేయమని ఎవరూ డబ్బులు ఇవ్వట్లేదు, ఏ పార్టీ ఇవ్వట్లేదు. అమిత్ షా గారి నుంచి నాకు ఇన్విటేషన్ వచ్చింది. కానీ నేనే వెళ్ళలేదు. నేను ఆయన్ని కలిస్తే మళ్ళీ రాజకీయంగా చూస్తారు. అందుకే కలవలేదు. నాకు సినిమా వేరు, రాజకీయం వేరు. నేను ఏ రాజకీయ పార్టీ కి సంబందించిన వ్యక్తిని కాను. కార్తికేయ 2 చూశాక నన్ను నన్ను అందరూ, అన్ని పార్టీల వారు అభినందించారు. ఈ సినిమాను కూడా అన్ని ప్రభుత్వాలకి, అందరు రాజకీయ నాయకులకు చూపిస్తాము, మీడియాకు కూడా ఓ షో వేస్తాము అని తెలిపారు. దీంతో నిఖిల్ చేసిన వ్యాఖ్యలు సంచనలంగా మారాయి. మరి దీనిపై బీజేపీ నాయకులు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.