Nitish Kumar: మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కలిసిన నితీశ్ కుమార్

వాస్తవానికి తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు రావాలని నితీశ్ కుమార్ అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రధాని అభ్యర్థిత్వం దక్కకపోవచ్చు. కారణం.. ఆ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థని భావిస్తోంది.

Nitish Kumar: మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కలిసిన నితీశ్ కుమార్

Mallikarjun Kharge: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీలను బిహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ అధినేత నితీశ్ కుమార్ కలిశారు. సోమవారం ఢిల్లీలోని ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరిగింది. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాట్లలో ఉన్న నితీశ్ కుమార్.. కాంగ్రెస్ నేతల్ని కలవడం కీలక పరిణామమని అంటున్నారు. వాస్తవానికి తొలుత బీజేపీ, కాంగ్రెస్ ప్రమేయం లేకుండా స్థానిక పార్టీలతో కలిసి ఫ్రంట్ ఏర్పాటు అవుతుందని అనుకున్నారు. కానీ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో పరిణామాలు మారిపోయాయి.

Mallikarjun Kharge: నూతన పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభించడంపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

వాస్తవానికి తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు రావాలని నితీశ్ కుమార్ అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రధాని అభ్యర్థిత్వం దక్కకపోవచ్చు. కారణం.. ఆ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీ అయినా ప్రధాని అభ్యర్థిత్వం మర్చిపోవాల్సిందే. అయితే కాంగ్రెస్ పార్టీ లేకుండా బీజేపీని ఓడించడం కష్టమనే అభిప్రాయాలు పెద్ద ఎత్తున వ్యక్తం అయ్యాయి. దీనికి తోడు స్థానిక పార్టీల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు దొరకలేదు.

Karnataka: ఆడంబరాలకు దూరంగా కొత్త సీఎం.. వెంటవెంటనే కీలక ప్రకటనలు

దీంతో.. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు. మమతా బెనర్జీ సైతం ఫ్రంట్ ఏర్పాటుకు సై అన్నారు. తొలుత కాంగ్రెస్ పార్టీతో జత కట్టేదే లేదని తేల్చి చెప్పారు. అయితే ఆమెకు సైతం స్థానిక పార్టీల ఐక్యత సాధ్యం కాదని తేలిపోవడంతో ఇక హస్తంతో వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అయితే ఎన్నికల ముందు పొత్తు కాకుండా, ఎన్నికల తర్వాత పొత్తుకు దీదీ మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది.