Thiruvannamalai Girivalam : కార్తీక పౌర్ణమికి గిరి ప్రదక్షిణకు రాకండి-తిరువణ్ణామలై కలెక్టర్
అరుణాచలేశ్వరుడి భక్తులకు తిరువణ్ణామలై కలెక్టర్ షాకింగ్ న్యూస్ చెప్పారు. కరోనా వైరస్ నేపధ్యంలో ఈనెల 17వ తేదీ నుంచి 20వ తేదీవరకు తిరువణ్ణామలై లో జరిగే కార్తీక దీపోత్సవానికి భక్తుల

Thiruvannamalai Deepam festival 2021
Thiruvannamalai Girivalam : అరుణాచలేశ్వరుడి భక్తులకు తిరువణ్ణామలై కలెక్టర్ షాకింగ్ న్యూస్ చెప్పారు. కరోనా వైరస్ నేపధ్యంలో ఈనెల 17వ తేదీ నుంచి 20వ తేదీవరకు తిరువణ్ణామలై లో జరిగే కార్తీక దీపోత్సవానికి భక్తులెవరూ ఆలయంలో దర్శనానికి రావద్దని విజ్ఞప్తి చేశారు.
అరుణా చలంలో కార్తీకమాసం లో జరిగే దీపోత్సవానికి లక్షలాది మంది భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి తిరువణ్ణామలై చేరుకుని పౌర్ణమిరోజు గిరి ప్రధక్షిణ కూడా చేస్తారు. ఆ దీపోత్సవాన్ని దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని.. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే విశేషించి జీవితంలో మంచి మార్పులు జరుగుతాయని భక్తుల విశ్వాసం.
Also Read : Tigers Attack On Cows : ఖమ్మం జిల్లా వాసులను వణికిస్తున్న పులుల సంచారం
అయితే కోవిడ్ నిబంధనల నేపధ్యంలో భక్తులెవరూ ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు తిరువణ్ణామలై రావద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Thiruvannamalai Deepam Festival

Arunachala Giri Pradakshinam