Sushant Singh Rajput Flat : సుశాంత్ ఇల్లా..! అమ్మో అంటున్నారు.. చనిపోయి రెండున్నరేళ్లు అవుతున్నా ఇంకా ఎవరూ అద్దెకు రాలేదు

సుశాంత్ ప్లాట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం ఇంకా ఆ ప్లాట్ ఖాళీగా ఉండటమే. సుశాంత్ ప్లాట్ చేసి.. అమ్మో అంటున్నారు జనాలు. సుశాంత్ చనిపోయాక ఆ ఇంట్లోకి అడుగు పెట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు.

Sushant Singh Rajput Flat : సుశాంత్ ఇల్లా..! అమ్మో అంటున్నారు.. చనిపోయి రెండున్నరేళ్లు అవుతున్నా ఇంకా ఎవరూ అద్దెకు రాలేదు

Updated On : December 27, 2022 / 11:02 AM IST

Sushant Singh Rajput Flat : సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. పరిచయం అక్కర్లేని పేరు. ఈ బాలీవుడ్ స్టార్ తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. 2020 జూన్ 14న తన ప్లాట్ లో సూసైడ్ చేసుకున్నాడు సుశాంత్.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుశాంత్.. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరో.. అకస్మాత్తుగా సూసైడ్ చేసుకోవడం ఇటు ప్రేక్షకులనే కాదు.. అటు సినీ ప్రముఖులనూ షాక్ కు గురిచేసింది. సుశాంత్ ఆత్మహత్యపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

కాగా, సుశాంత్ ప్లాట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం ఇంకా ఆ ప్లాట్ ఖాళీగా ఉండటమే. సుశాంత్ ప్లాట్ చేసి.. అమ్మో అంటున్నారు జనాలు. సుశాంత్ చనిపోయాక ఆ ఇంట్లోకి అడుగు పెట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు.

Also Read..Sushanth Singh Rajput : షాకింగ్ మిస్టరీ.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితుల ఆత్మహత్యలు..

ఇలా రెండున్నరేళ్లుగా సుశాంత్ ఇల్లు ఖాళీగానే ఉంది. ఆ ఇంట్లో అద్దెకు దిగేందుకు భయపడుతున్నారట. ఈ విషయాన్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్ రఫీక్ మర్చంట్ స్వయంగా వెల్లడించాడు. ఒకప్పుడు అసలు ఇంటిని చూసేందుకు కూడా వచ్చే వారు కాదని, ఇప్పుడు కాస్త నయమని చెప్పాడు. కాగా, ఆ ప్లాట్ రెంట్ నెలకు రూ.5లక్షలు అని తెలిపాడు.

ఈ ఖరీదైన ఫ్లాట్ వీడియోను రియల్ ఎస్టేట్ బ్రోకర్ రషీద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీని అద్దె నెలకు కేవలం రూ. 5 లక్షలు అని తెలిపాడు. ఇంతకుముందు ఈ ఫ్లాట్‌ను చూడటానికి కూడా ఇష్టపడే వారు కాదు, ఇప్పుడు కనీసం ఆసక్తి అయినా చూపుతున్నారని అన్నాడు. ఈ ప్లాట్ ఓ NRI దని, ఇంటి అద్దెను తగ్గించడం ఆయనకు ఇష్టం లేదన్నారు రషీద్. కాగా, సినీ ప్రముఖులకు ఫ్లాట్‌ను అద్దెకు ఇవ్వడానికి ఇంటి ఓనర్ సుముఖంగా లేడని కూడా ఆయన వెల్లడించారు. ఇంటిని అద్దెకు తీసుకోవడానికి కొంతమంది ఆసక్తి చూపుతున్నా, సుశాంత్ మరణించిన చోట ఉండటానికి వారి కుటుంబసభ్యులు ఒప్పుకోవడం లేదని ఆయన అన్నారు.

Also Read..Heroins : పెళ్లయి పిల్లలు పుట్టాక కూడా ఫిట్ గా బాడీ మెయింటైన్ చేస్తున్న హీరోయిన్స్..

ఇది 4BHK ప్లాట్. సముద్రానికి దగ్గరగా ఉన్న ఈ విలాసవంతమైన ప్లాట్ కు సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. నెలకు 4.5లక్షలు రెంట్ కట్టేవాడు. ఈ ప్లాట్ కి అటాచ్డ్ టెర్రస్ కూడా ఉంది.

సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సుశాంత్ సూసైడ్ పై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ గా ఎదగడం ఇష్టం లేని వారు సుశాంత్ ను చంపేశారని కొందరు ఆరోపించగా.. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని మరికొందరు వాపోయారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

దీంతో నెపోటిజం తెరపైకి వచ్చింది. సుశాంత్ సింగ్ ను మానసికంగా ఒత్తిడికి గురిచేశారని.. ఆ కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. అలాగే సుశాంత్ ఒంటిపై స్వల్ప గాయాలు ఉండడం కూడా పలు అనుమానాలను రేకెత్తించింది. ఇక సుశాంత్ సూసైడ్ కేసులో పోలీసుల విచారణ నిష్పక్షపాతంగా జరగలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సుశాంత్ మరణించి రెండేన్నరేళ్లు అయినప్పటికీ అతని మరణంపై స్పష్టమైన ఆధారాలు లభించకపోవడం అభిమానులను కలచివేస్తోంది.