Telangana State : టీకా కోసం ఎదురు చూపులు..కోవిడ్‌ టీకా పంపిణీ ఎప్పుడు..?

తెలంగాణలో వారం రోజులుగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ నిలిచిపోయింది. ప్రస్తుతం కరోనా కట్టడితోపాటు, మూడో దశ ముప్పు తప్పాలంటే టీకా ఒక్కటే మార్గమన్న తరుణంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Telangana State : టీకా కోసం ఎదురు చూపులు..కోవిడ్‌ టీకా పంపిణీ ఎప్పుడు..?

Tg Vaccination

No Vaccine : తెలంగాణలో వారం రోజులుగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ నిలిచిపోయింది. ప్రస్తుతం కరోనా కట్టడితోపాటు, మూడో దశ ముప్పు తప్పాలంటే టీకా ఒక్కటే మార్గమన్న తరుణంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 3 లక్షల మందికి ఈనెల చివరి నాటికి రెండో డోస్‌ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు వ్యాక్సినేషన్‌ ప్రారంభంపై వైద్యారోగ్యశాఖ ఊసెత్తడం లేదు.

తెలంగాణలో కోవిడ్‌ టీకా కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. గత నెలలో ఒకటి, రెండు రోజులు బ్రేక్‌ పడ్డా.. ఇలా ఎక్కువ రోజులు వ్యాక్సినేషన్‌ నిలిపివేయడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో ఇప్పటికే 43 లక్షల 76 వేల 229 మంది తొలి డోసు తీసుకున్నారు. వీరిలో అత్యధిక శాతం కొవిషీల్డ్‌ తీసుకున్నవారే. ఈ టీకా రెండో డోసు గడువును కేంద్రం 6 నుంచి 12 వారాలకు పెంచింది. ఇక ఈ నెలాఖరుకు సుమారు 3 లక్షల మంది కొవాగ్జిన్‌ రెండో డోసు తీసుకోవాల్సిన వారున్నారు. అయితే.. శనివారం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన వైద్యారోగ్యశాఖ మళ్లీ టీకా ప్రక్రియ ఎప్పుడనే దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు.

వ్యాక్సినేషన్‌ నిలిచిపోవడానికి కేంద్రం, రాష్ట్రం మధ్య లెక్కల్లో తేడాలు ప్రధాన కారణంగా తెలుస్తోంది. రాష్ట్రానికి 61 లక్షల 41 వేల డోసులు ఇచ్చామని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. వీటిలో 54 లక్షల 48 వేల డోసులు వినియోగించగా.. 6 లక్షల 93 వేల డోసులు రాష్ట్రం వద్దే ఉన్నాయంటోంది కేంద్రం. అయితే 56 లక్షల 25 వేల 920 డోసులు కేంద్రం నుంచి అందితే.. 0.89 శాతం వృథా అయ్యాయని, మరో 62 వేల 970 వ్యాక్సిన్‌ డోసులు ఆర్మీకి కేటాయించినట్లు చెబుతోంది తెలంగాణ సర్కార్‌. కేంద్రం కేటాయించినవి కాకుండా.. అదనంగా సుమారు 5 లక్షల డోసులు కొనుగోలు చేసినట్లు చేశామంటోంది ప్రభుత్వం. వీటిని కలుపుకొని కేంద్రం లెక్కలు చెబుతుండగా.. తామ కొనుగోలు చేసిన వాటిని ఆ లెక్కల్లో ఎలా చూపిస్తామని రాష్ట్రం వాదిస్తోంది.

రాష్ట్రంలో వారం రోజులుగా వ్యాక్సినేషన్‌ ఆగిపోవడంపై.. కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఫైరయ్యారు. రాష్ట్రంలో 6 లక్షల డోసులున్నాయని వైద్యారోగ్యశాఖ లెక్కలే చెబుతున్నాయని.. మరి ఎందుకు వ్యాన్సినేషన్ ఆపాల్సి వచ్చిందో చెప్పాలన్నారాయన. పట్టింపులకు పోకుండా.. రాజకీయాలు చేయకుండా టీకా ప్రక్రియ కొనసాగించాలని డిమాండ్‌ చేశారు కిషన్‌రెడ్డి. వ్యాక్సిన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాదులాడుకుంటుండటంతో.. తిరిగి ఎప్పటినుంచి టీకా ప్రక్రియ ప్రారంభిస్తారో తెలియక రెండో డోసు కోసం ఎదురుచూస్తున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు మూడో వేవ్‌పై హెచ్చరికతలో 18 ఏళ్లు పైబడినవారు సైతం టీకా కోసం ఆసక్తి చూపుతున్నారు.

Read More : CM KCR : లాక్ డౌన్ తప్పవేరే మార్గం లేదు..త్వరలోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్