NTR 30 : తారక్ – కొరటాల క్రేజీ కాంబినేషన్.. వన్స్ మోర్!..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది. తెలుగు సంవత్సరాది ఉగాది కానుకగా తారక్ కొత్త సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్..

NTR 30 : తారక్ – కొరటాల క్రేజీ కాంబినేషన్.. వన్స్ మోర్!..

Ntr 30

NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది. తెలుగు సంవత్సరాది ఉగాది కానుకగా తారక్ కొత్త సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్..

NTR 30

ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. తారక్, త్రివిక్రమ్, హారికా హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలయికలో ఎన్టీఆర్ 30వ సినిమాను ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే అనివార్య కారణాల వల్ల తారక్ 30 ప్లేసులో మరో సినిమా వచ్చి చేరింది.

Jr.Ntr : ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కోసం ఎన్టీఆర్ వేసుకున్న బ్లేజర్ రేటు ఎంతంటే…

‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ తర్వాత తారక్-కొరటాల కలయికలో మరో సినిమా రాబోతున్నట్లు అధికారకంగా ప్రకటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ మీద కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2022 ఏప్రిల్ 29న రిలీజ్ చెయ్యనున్నారు.