NTR30: తన నెక్ట్స్ మూవీపై ఎన్టీఆర్ కామెంట్స్.. ‘ఆర్ఆర్ఆర్’ను మ్యాచ్ చేస్తామంటోన్న తారక్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ కోసం ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఆర్ఆర్ఆర్ టీమ్ చేసిన విస్తృతమైన ప్రమోషన్స్ ఎట్టకేలకు ఫలించాయి. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ దక్కించుకోవడంతో, భారత సినీ చరిత్రలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది ఆర్ఆర్ఆర్ టీమ్.

NTR30: తన నెక్ట్స్ మూవీపై ఎన్టీఆర్ కామెంట్స్.. ‘ఆర్ఆర్ఆర్’ను మ్యాచ్ చేస్తామంటోన్న తారక్!

NTR Hot Comments On NTR30 Goes Viral

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ కోసం ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఆర్ఆర్ఆర్ టీమ్ చేసిన విస్తృతమైన ప్రమోషన్స్ ఎట్టకేలకు ఫలించాయి. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ దక్కించుకోవడంతో, భారత సినీ చరిత్రలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది ఆర్ఆర్ఆర్ టీమ్. ఇక ఈ పాటకు ఆస్కార్‌ను ప్రకటించగా, తారక్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సంతోషంతో ఊగిపోయారు. వారు ఎంత సంతోషంగా ఉన్నారో, వారి ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఆస్కార్ అవార్డును హీరోలిద్దరు తమ చేతుల్లో పట్టుకుని ముద్దాడిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

NTR: ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పర్ఫార్మెన్స్.. క్లారిటీ ఇచ్చిన తారక్!

ఈ క్రమంలో హాలీవుడ్ మీడియాతో వారు మాట్లాడారు. ఇందులో తారక్ ఓ హాలీవుడ్ మీడియాతో మాట్లాడిన మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి తారక్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన నెక్ట్స్ మూవీ కూడా భారీ చిత్రంగా రాబోతుందని.. ఈ సినిమా షూటింగ్‌ను ఈనెలలో స్టార్ట్ చేస్తున్నామని.. ఈ సినిమా కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని తారక్ అన్నాడు. అంతేగాక, ఈ సినిమాను క్వాలిటీ పరంగా ఆర్ఆర్ఆర్ మూవీని మ్యాచ్ అయ్యేలా చేస్తామిన తారక్ కామెంట్ చేశాడు.

NTR30: ఆ సూపర్ హిట్ పాటను రీమిక్స్ చేస్తున్న తారక్-జాన్వీ..?

దీంతో తారక్ తన 30వ చిత్రాన్ని ఏస్థాయిలో ప్రెస్టీజియస్‌గా తీసుకున్నాడో ఈ కామెంట్స్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఆయన లాస్ట్ మూవీ ‘ఆచార్య’ డిజాస్టర్‌గా నిలవడంతో, ఈసారి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి. మరి తారక్ చేసిన కామెంట్స్ ఈ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.