NTR: బింబిసారుడి సమక్షంలో అందరికీ షాకిచ్చిన ఎన్టీఆర్

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బింబిసారా’పై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రావడంతో నందమూరి షాక్ అయ్యారు.

NTR: బింబిసారుడి సమక్షంలో అందరికీ షాకిచ్చిన ఎన్టీఆర్

Ntr Shocked Fans With His Over Weight At Bimbisara Pre Release Event

NTR: నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బింబిసారా’పై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ ఫాంటెసీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌ను నిన్న హైదరాబాద్‌లో నిర్వహించింది చిత్ర యూనిట్. ఇక ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రావడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Jr NTR : థియేటర్లకి జనాలు రావడం లేదని అంటున్నారు.. నేను నమ్మను..

అయితే ఈ ఈవెంట్‌కు వచ్చిన తారక్, నిజానికి చాలా మందిని నిరాశకు గురిచేశాడని చెప్పాలి. ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత తన నెక్ట్స్ మూవీని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా కోసం తారక్ బరువును తగ్గే పనిలో ఉన్నాడని.. ఇప్పటికే హార్డ్ వర్కవుట్‌లు చేస్తున్నాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. దీంతో అభిమానులు కూడా ఇది నిజం అనుకుని ఉన్నారు. కానీ.. బింబిసారా ప్రీరిలీజ్ వేడుకలో తారక్ అవతారం చూసి అందరూ నోరెళ్లబెట్టారు.

Bimbisara : బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్

తమ హీరో స్లిమ్ అవుతున్నాడని అనుకుంటే, ఇంకాస్త బొద్దుగా మారి అందరికీ షాకిచ్చాడు. ఇంకా తన నెక్ట్స్ మూవీ కోసం వర్కవుట్స్ మొదలుపెట్టని తారక్, కొరటాల శివతో మూవీని ఎప్పటికి పట్టాలెక్కిస్తాడా అని వారు ఆలోచిస్తున్నారు. ఏదేమైనా తారక్ అవతారం చూసి అభిమానులు షాక్ అవ్వడం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.