Rail Minister’s Office : కొత్త రైల్వే మంత్రి కీలక నిర్ణయం..2 ఫిష్ట్ లలో అర్థరాత్రి దాకా పనిచేయనున్న ఉద్యోగులు

కేంద్ర కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకొని గురువారం రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు బాధ్యతలు చేపట్టిన అశ్వినీ వైష్ణవ్..తొలిరోజే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.

Rail Minister’s Office : కొత్త రైల్వే మంత్రి కీలక నిర్ణయం..2 ఫిష్ట్ లలో అర్థరాత్రి దాకా పనిచేయనున్న ఉద్యోగులు

Railway

Rail Minister’s Office కేంద్ర కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకొని గురువారం రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు బాధ్యతలు చేపట్టిన అశ్వినీ వైష్ణవ్..తొలిరోజే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రైల్వే శాఖ కార్యాలయంలోని అధికారులు మరియు సిబ్బంది రెండు షిఫ్ట్ లలో పనిచేయాలని రైల్వే మంత్రి ఆదేశించారు.

ఉద్యోగుల పని వేళలను రైల్వే మంత్రిత్వ శాఖ రెండుగా విభజించించిన నేపథ్యంలో… తొలి షిఫ్ట్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. రెండవ షిఫ్టు..మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగుతుంది. అంటే ఢిల్లీలోని రైల్వేశాఖ కార్యాలయం ఉదయం 7 గంటలకే తన కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. ఉద్యోగులందరూ 7 గంటలకే కార్యాలయానికి చేరుకుంటారు… అర్ధరాత్రి 12 గంటల వరకు విధి నిర్వహణలో ఉంటారు. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ (ప్రజా వ్యవహారాలు) డీజే నారాయణ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలంటే.. నిద్రను కొంత త్యాగం చేయాల్సి ఉంటుందని రైల్వే మంత్రి వైష్ణవ్ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పట్టాలు తప్పిన రైల్వేను గాడిన పెట్టడానికి శ్రమించాల్సి ఉంటుందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. కాగా, ఒడిషాకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన అశ్వినీ వైష్ణవ్ రెండెళ్ల క్రితమే బీజేపీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. అర్థరాత్రి వరకు పనిచేసే వ్యక్తిగా వైష్ణవ్ కి పేరు ఉంది. రైల్వేతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కూడా ప్రస్తుతం ఆయన ఆధీనంలో ఉంది.

ఇక,శుక్రవారం(జులై-9,2021)రైల్వే మంత్రి వైష్ణవ్..రైల్వే శాఖ సహాయ మంత్రులతో కలిసి..రైల్వే బోర్డు సభ్యులతో ఫుల్ బోర్డ్ ఇంట్రడక్టరీ(పరిచయ మీటింగ్) రివ్యూ మీటింగ్ నిర్వహించారు.