Omicron: ఒమిక్రాన్ కొత్త లక్షణాలు.. కంటిలో ఈ మార్పులు కనిపించొచ్చు

ఒమిక్రాన్ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న కొద్దీ, అనేక కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి.

Omicron: ఒమిక్రాన్ కొత్త లక్షణాలు.. కంటిలో ఈ మార్పులు కనిపించొచ్చు

Eye Problem In Corona

Omicron: ఒమిక్రాన్ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న కొద్దీ, అనేక కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు Omicron సోకినవారిలో కొంతమందికి కంటి సమస్యలు విపరీతంగా కనిపిస్తున్నాయి. కరోనా లక్షణాలలో రోగికి దగ్గు ముఖ్యమైన లక్షణం కాగా.. విరేచనాలు రకాల సమస్యలు కనిపిస్తున్నట్లుగా డాక్టర్లు చెబుతున్నారు. అదే సమయంలో, ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలలో కంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కరోనా కొత్త వేరియంట్‌లో కనిపిస్తున్న లక్షణాలు:
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ రోగట కంటికి సంబంధించిన సమస్యల గురించి చెప్పింది. ఓమిక్రాన్ అనే కొత్త వేరియంట్ కరోనా సోకిన రోగులలో కళ్లు ఎర్రబడడం, చూపు తగ్గడం, కంటిలోని తెల్లటి భాగం మరియు కనురెప్పల పొర వాపు, అంటే కండ్లకలక వంటి లక్షణాలు కనిపిస్తాయని నివేదికలో చెప్పబడింది. ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్.

ఓమిక్రాన్ లక్షణాలు:
1- కళ్లు ఎర్రగా మారడం
2- కళ్లలో చికాకు సమస్య
3- కళ్లలో నొప్పి
4- కళ్లలో చూపు మసకబారడం
5- కళ్లలో కాంతి సున్నితత్వం
6- ఎక్కువగా నీరు కారడం
7- కనురెప్పల పొరలు వాపు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌లో కళ్ళకు సంబంధించిన ఈ లక్షణాలు కనిపిస్తాయి. కరోనా సోకిన రోగుల 5 శాతం మంది కండ్లకలక బాధితులు కూడా అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే, కంటికి సంబంధించిన ఈ లక్షణాలు ఉన్నంతమాత్రాన కరోనా అని నిర్దారించుకోవద్దు.. కచ్చితంగా టెస్టింగ్ ద్వారా మాత్రమే వ్యాధిని గుర్తించండి.

అధ్యయనం ఏం చెబుతోంది?
కరోనా సోకిన వ్యక్తికి ఈ ప్రారంభ లక్షణాలు ఉండవచ్చని భారతీయ పరిశోధకులు భావిస్తున్నారు. కంటి సమస్యను కరోనా ముందస్తు హెచ్చరికగా పరిగణించవచ్చు. సాధారణ జనాభాలో 35.8% మందితో పోలిస్తే 44 శాతం మంది కోవిడ్ రోగులు కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని ఒక అధ్యయనం కనుగొంది. ఇందులో కళ్లలో నీళ్లు కారడం, లైట్ సెన్సిటివిటీ వంటి సమస్యలు ఉంటాయి. అదే సమయంలో, కొంతమందికి కళ్లలో నొప్పి కూడా ఉంటుంది. అయితే, రోగి కోలుకున్న తర్వాత, కంటికి సంబంధించిన సమస్య నుంచి కూడా కోలుకుంటున్నారు.

AP Treasury Employees : ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సహాయ నిరాకరణ.. ‘జీతాలు ప్రాసెస్ చేయలేమ్’

ఈ లక్షణాలు కంటిలో కనిపిస్తే, చికిత్స ఎలా?
మీకు కంటిలో తేలికపాటి లక్షణాలు కనిపిస్తే, మీరు ఇంట్లో చికిత్స చేసుకోవచ్చు. NHS ప్రకారం, మీరు నీటిని వేడి చేసి, చల్లబడిన తర్వాత, కాటన్ ప్యాడ్ సహాయంతో కళ్లను తుడవండి. మీకు ఎక్కువ ఇబ్బంది ఉంటే, కొన్ని నిమిషాల పాటు మీ కళ్ళపై చల్లని గుడ్డ ఉంచండి. ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.