Omicron BA.4 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.4 తొలి కేసు నమోదు.. హైదరాబాద్ లో గుర్తింపు

దక్షిణాఫ్రికాలో కరోనా ఉధృతికి కారణమైన రెండు ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ లో బీఏ.4 కూడా ఒకటిగా చెప్పవచ్చు. అంతకముందు కరోనా సోకినా, రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఇది సోకుతున్నట్లు నిర్ధారణ అయింది.

Omicron BA.4 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.4 తొలి కేసు నమోదు.. హైదరాబాద్ లో గుర్తింపు

Omicron Ba.4

Omicron BA.4 : కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచదేశాలను పట్టిపీడిస్తూనేవుంది. డేల్టా, డేల్టా ప్లస్, ఒమిక్రాన్ వంటి కొత్త కొత్త వేరియట్స్ రూపంలో మానవాళిపై దాడి చేస్తూ ప్రాణాలు హరిస్తోంది. దక్షిణాఫ్రికాతోపాటు పలు దేశాల్లో కరోనా కేసుల ఉధృతి కావడానికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.4 కారణమైంది. ఇప్పుడు భారత్ లోనూ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.4 వెలుగు చూసింది.

దేశంలో ఈ సబ్ వేరియంట్ కు సంబంధించిన తొలి కేసు నమోదు కావడం కలవర పెడుతోంది. ఈనెల 9న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.4ను గుర్తించారు. ఇండియన్ సార్స్ కోవ్-2 కన్షార్షియం ఆన్ జీనోమిక్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలోని మరిన్ని నగరాల్లో ఈ సబ్ వేరియంట్ కేసులు నమోదయ్యే అవకాశముందని భారత వైద్య పరిశోధన మండలి శాస్త్రవేత్త పేర్కొన్నారు.

Omicron sub variants: ఒమిక్రాన్ సబ్ వేరియంట్లతో వ్యాక్సిన్ తీసుకున్నా ముప్పు తప్పదా?.. శాస్త్రవేత్తలు ఏమన్నారంటే?

దక్షిణాఫ్రికాలో కరోనా ఉధృతికి కారణమైన రెండు ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ లో బీఏ.4 కూడా ఒకటిగా చెప్పవచ్చు. అంతకముందు కరోనా సోకినా, రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఇది సోకుతున్నట్లు నిర్ధారణ అయింది. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ కంటే ఇది ప్రమాదకారి కాదనీ, కాకపోతే వీటి వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక విభాగం చీఫ్ మారియా వాన్ కెర్ఖోవ్ వెల్లడించారు.

భారత్ లో ఇప్పటికే ఒమిక్రాన్ ఒకసారి వ్యాపించడం, వ్యాక్సినేషన్ విస్తృతంగా చేపట్టడం వల్ల ఒమిక్రాన్ బీఏ.4 ప్రభావం స్వల్పంగానే ఉండవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీఏ.4 సబ్ వేరియంట్ వల్ల కొద్ది రోజుల్లో కేసులు పెరుగవచ్చు.. కానీ ఉధృతి తక్కువగానే ఉంటుందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఉన్నతాధికారి తెలిపారు. బాధితులకు తీవ్రస్థాయి అనారోగ్య ముప్పు, ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఉండవు అని స్పష్టం చేశారు.