Presidential Election: ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ? ఆయన ఎవరంటే..

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో పలు పార్టీల నేతలు బుధవారం సాయంత్రం ఢిల్లీలో సమావేశం అయ్యాయి.

Presidential Election: ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ? ఆయన ఎవరంటే..

Gopal Kristna

Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో పలు పార్టీల నేతలు బుధవారం సాయంత్రం ఢిల్లీలో సమావేశం అయ్యాయి. అయితే ఇప్పటికే ప్రతిపక్షాల అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరత్ పవార్ ను బరిలో నిలిపేందుకు సిద్ధమయ్యారు. అయితే చివరినిమిషంలో పవార్ తాను రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో లేనని స్పష్టం చేశారు. దీంతో ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా ప్రతిపక్ష పార్టీల మద్దతుతో రాష్ట్రపతి అభ్యర్థిగా గోపాల్ కృష్ణ గాంధీ పేరు పరిశీలన చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలు గోపాల్ కృష్ట గాంధీతో ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం.

President Elections 2022 : నేటి మమతా బెనర్జీ సమావేశానికి టీఆర్ఎస్ దూరం

ఐఏఎస్‌, మాజీ దౌత్యవేత్త అయిన గోపాల్ కృష్ణ గాంధీ మహాత్మాగాంధీ మనువడు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గానూ పనిచేశారు. 2017లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోపాల్‌ గాంధీ పోటీ చేశారు కూడా. అయితే ఆ సమయంలో వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా గెలుపొందారు. తాజాగా ప్రతిపక్షాల అభ్యర్థిగా గోపాల్ కృష్ణ గాంధీతో సంప్రదింపులు సైతం చేసినట్లు తెలిసింది. అయితే తనకు కొంత సమయం కావాలని ఆయన కోరినట్లు సమాచారం. ఒకవేళ గోపాల్ కృష్ణ నుంచి సానుకూల ప్రకటన వస్తే ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయనే ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గోపాల్ కృష్ణ గాంధీతో పాటు పలువురి పేర్లను ప్రతిపక్ష పార్టీలు నేతలు పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. బుధవారం సాయంత్రం నిర్వహించే ప్రతిపక్షాల సమావేశంలో అభ్యర్థి ఎంపికపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.