No Mask No Entry : మాస్క్ ఉంటేనే బస్సులోకి అనుమతి

కరోనా కట్టడికి టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. సరైన మాస్క్ ఉంటేనే ప్రయాణికులను బస్సులోకి అనుమతించాలన్నారు. డ్రైవర్, కండక్టర్ విధిగా మాస్క్ ధరించాలని తెలిపారు.

No Mask No Entry : మాస్క్ ఉంటేనే బస్సులోకి అనుమతి

Sajjanar

TSRTC MD Sajjanar Orders : ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లో కూడా గుబులు పుట్టిస్తోంది. తాజాగా భారత్‌లో మూడో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ జెట్ వేగంతో ఇప్పటికే 38 దేశాల్లో వ్యాపించిపోయింది. అలాగే భారత్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే భారత్ లో రెండు ‘ఒమిక్రాన్’వేరియంట్ కేసులు నమోదు కాగా తాజాగా మరో కేసు కూడా నమోదు అయ్యింది.

ప్రపంచవ్యాప్తంగా కంగారు పెట్టేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా టెన్షన్ పెట్టేస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని పర్యవేక్షణలో పెడుతున్నారు.

Warangal : ఆరోగ్య ప్రధాయినిగా ఓరుగల్లు.. 2 వేల పడకలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

ఇందులో భాగంగా కరోనా కట్టడికి టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం ఉత్తర్వులు జారీ చేశారు. సరైన మాస్క్ ఉంటేనే ప్రయాణికులను బస్సులోకి అనుమతించాలన్నారు. డ్రైవర్, కండక్టర్ విధిగా మాస్క్ ధరించాలని తెలిపారు. శానిటైజర్ సీసాను అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. కరోనా ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను బస్ స్టాండ్లలో మైకుల ద్వారా తరచూ ప్రకటిస్తుండాలని సూచించారు.

డిపో నుంచి బస్సులు బయటకు వచ్చే ప్రతిసారీ పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని వెల్లడించారు. బస్ స్టాండు ఆవరణలో ప్రయాణికులు మాస్కులు ధరించడం అనివార్యమని స్పష్టం చేసే బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. బస్ స్టాండ్లను తరచూ శుభ్రం చేస్తుండాలన్నారు. అన్ని రెస్ట్ రూమ్ ల్లో సబ్సులు అందుబాటులో ఉంచాలని సజ్జనార్ ఆదేశించారు.

Renault‌ Bumper Offer : రెనాల్ట్‌ బంపర్‌ ఆఫర్‌.. కార్లపై భారీ డిస్కౌంట్లు

మరోవైపు పర్యాటక ప్రాంతాల్లో కూడా నిబంధనలు కఠినతరం చేసింది ప్రభుత్వం. ట్యాంక్‌బండ్‌, చార్మినార్‌, నెక్లెస్ రోడ్ వద్ద ‘ఫన్‌డే’ వేడుకలను రద్దు చేసింది. పర్యాటకులపైనే కాదు.. సాధారణ పౌరులపై కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి ఒక్కరూ మాస్క్‌ పెట్టుకోవాల్సిందేని, లేనివారికి స్పాట్ ఫైన్ రూ.వెయ్యి వెయ్యనున్నట్లు ఆదేశించింది.

జియాగూడ, మేకలమండి, మలక్‌పేట్‌ గంజ్, బేగంబజార్, పాతబస్తీ, మలక్‌పేట్, బేగంపేట్, మాదన్నపేట, గుడిమల్కాపూర్, సరూర్‌నగర్‌ మార్కెట్లపై మళ్లీ ఆంక్షలు విధించి, వైరస్‌కు హాట్‌స్పాట్‌లుగా వీటిని గుర్తించింది. ఫిజికల్ డిస్టెన్స్ నిబంధనలను కఠినంగా పాటించాలని, ఉల్లంఘించిన వ్యాపారులపై కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించింది.