Peanuts : గుండెను రక్షించే వేరుశెనగలు

పల్లీలు తింటే ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు పరిశోధకులు. ప్రతి రోజూ కొద్ది మోతాదులో తింటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు. పల్లీల్లో గుండెకు మేలు చేసే పోషకాలు ఉన్నాయి.

Peanuts : గుండెను రక్షించే వేరుశెనగలు

Peanuts

peanuts protects Heart : పల్లీలు (వేరుశెనగలు) తింటే ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు పరిశోధకులు. ప్రతి రోజూ కొద్ది మోతాదులో తింటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పల్లీల్లో గుండెకు మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. పల్లీలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కార్డియో వాస్క్యులర్‌ వ్యాధులు వచ్చే ఆస్కారం చాలా తక్కువని పరిశోధనల్లో తేలింది.

ప్రతి రోజు సగటున 4-5 వేరు శెనగలు అంటే.. పది గింజల వరకే తింటే మంచిదంటున్నారు. ఏ సమయంలోనైనా తినవచ్చని చెబుతున్నారు. దీని వల్ల కెమికల్‌ స్ట్రోక్‌/కార్డియో వాస్క్యులర్‌ సమస్య దరిదాపుల్లోకి కూడా రాదని జపాన్‌లోని ఒసాకా యూనివర్సిటీ పరిశోధన బృందం చెబుతోంది.

Heart Health : గుండె ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

పల్లీల్లో గుండెకు మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయని జపాన్‌ పరిశోధకులు అంటున్నారు. వీటిలోని మోనోశాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌, పాలీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌, మినరల్స్‌, విటమిన్స్‌ వంటివి మంచి చేస్తాయి. అలాగే అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయని కూడా పరిశోధకులు చెబుతున్నారు.