Pensioners : పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. గడువు పెంపు

పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెన్షన్ పొందేందుకు ఏటా బ్యాంకులు/పోస్టాఫీసులకు లైఫ్‌ సర్టిఫికెట్‌/జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పించాల్సిన గడువును పొడిగించింది.

Pensioners : పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. గడువు పెంపు

Pensioners

Pensioners : పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెన్షన్ పొందేందుకు ఏటా బ్యాంకులు/పోస్టాఫీసులకు లైఫ్‌ సర్టిఫికెట్‌/జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పించాల్సిన గడువును పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు నవంబర్‌ 30తో ముగిసింది. దాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. డిసెంబర్‌ 31 వరకు పెన్షనర్లు తమ లైఫ్‌ సర్టిఫికెట్‌ను బ్యాంకులకు సమర్పించవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. పలు రాష్ట్రాల్లో కరోనా కలకలం రేపుతోంది. ఈ పరిస్థితుల్లో వృద్ధులకు కొవిడ్‌ ముప్పు అధికంగా ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

SBI : ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్, వడ్డీ రేట్లు తగ్గింపు.. అమల్లోకి కొత్త రూల్స్

ప్రతి సంవత్సరం పెన్షన్‌దారులు తమ లైఫ్‌ సర్టిఫికేట్‌ను పెన్షన్ మంజూరు చేసే సంస్థలకు సమర్పించాల్సి ఉంటుంది. తాము జీవించే ఉన్నామని రుజువుగా బ్యాంకులు, పోస్టాఫీసులు వంటి పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీలకు లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించాలి. ప్రతినెలా పెన్షన్‌ను పొందాలంటే ఈ సర్టిఫికేట్‌ అందించడం తప్పనిసరి. అయితే ఈ ఏడాది పింఛనుదారులు తమ జీవన్ ప్రమాణ్‌ను నవంబర్ 30 లోపు సమర్పించాల్సి ఉండేది. కాగా, దాని గడువుని డిసెంబర్ 31 వరకు పెంచింది కేంద్ర ప్రభుత్వం.

Financial Planners : మీ ఆదాయం రూ.10లక్షల లోపేనా? నెలకు రూ.3,300 ఆదా చేస్తే.. రూ.9 కోట్లు కూడబెట్టొచ్చు.. ఎలాగంటే?

ఈపీఎఫ్‌ నిబంధనల ప్రకారం.. ఈపీఎస్‌ పెన్షనర్లు గత సంతవ్సరం డిసెంబర్‌ 15, 2020న లైఫ్‌ సర్టిఫికేట్‌ సమర్పించినట్లయితే మళ్లీ డిసెంబర్‌ 15, 2021లోపు సమర్పించాల్సి ఉంటుంది. లేని పక్షంలో పెన్షన్‌ నిలిచిపోతుంది.