IND vs AUS Test Match: నాలుగో టెస్ట్ మ్యాచ్‌‌‌కు భారత్, ఆస్ట్రేలియా ప్రధానులు

మార్చి 9నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బెనెజ్ రానున్నారు. నాల్గో టెస్ట్ మ్యాచ్ ప్రారభం రోజున వీరు గ్రౌండ్‌లోకి వచ్చి మ్యాచ్‌ను వీక్షించే అవకాశం ఉంది.

IND vs AUS Test Match: నాలుగో టెస్ట్ మ్యాచ్‌‌‌కు భారత్, ఆస్ట్రేలియా ప్రధానులు

IND vs AUS Test Match

Updated On : February 22, 2023 / 7:44 AM IST

IND vs AUS Test Match: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇండియాలో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది. ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్‌లు పూర్తికాగా రెండింటిలో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడో మ్యాచ్ మార్చి 1 నుంచి ఇండోర్‌లో జరుగుతుంది. నాలుగో టెస్ట్ మ్యాచ్ మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు ఇండియా, ఆస్ట్రేలియా ప్రధానులు రానున్నట్లు తెలిసింది.

IND vs AUS Test Match: ఆసీస్‌కు మరో ఎదురుదెబ్బ.. ఉన్నపళంగా స్వదేశానికి కెప్టెన్ పాట్ కమిన్స్ ..

మార్చి 9నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బెనెజ్ రానున్నారు. నాల్గో టెస్ట్ మ్యాచ్ ప్రారభం రోజున వీరు గ్రౌండ్‌లోకి వచ్చి మ్యాచ్‌ను వీక్షించే అవకాశం ఉంది. ఆరేళ్ల విరామం తరువాత భారత గడ్డపై భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. 2017లో భారత్ లో జరిగిన చివరి నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ 2-1తో ఆస్ట్రేలియాను ఓడించింది.

IND vs AUS Test Match: రెండో టెస్టులో భారత్ విజయం.. 3వ రోజు ఆట ఫొటోలు ..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండు టెస్టు మ్యాచ్ లలో టీమిండియానే విజయం సాధించింది. రెండు మ్యాచ్ లను కూడా మూడు రోజుల్లోనే టీమిండియా ఆటగాళ్లు ముగించేశారు. ముఖ్యంగా టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్ర అశ్విన్ లు అద్భుత స్పిన్ బౌలింగ్ తో భారత్ విజయంలో కీలక భూమిక పోషించారు. మార్చి 1 నుంచి మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. రాబోయే రెండు టెస్టులు ఆస్ట్రేలియాలకు కీలకం. టీమిండియా సిరీస్ ను చేజిక్కించుకోవాలంటే మరో టెస్టు మ్యాచ్ గెలవాల్సి ఉంది.