PM Modi Photo : ‘ఇంట్లో పెట్టుకున్న ప్రధాని మోడీ ఫోటో తీసేయమని బెదిరిస్తున్నారు సార్’ పోలీసులకు వ్యక్తి ఫిర్యాదు

‘ఇంట్లో పెట్టుకున్న ప్రధాని మోడీ ఫోటో తీసేయమని బెదిరిస్తున్నారు సార్..తీయకపోతే ఇంట్లోంచి గెంటేస్తానని బెదిరిస్తున్నారు సార్’ అంటూ ఓవ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

PM Modi Photo : ‘ఇంట్లో పెట్టుకున్న ప్రధాని మోడీ ఫోటో తీసేయమని బెదిరిస్తున్నారు సార్’ పోలీసులకు వ్యక్తి ఫిర్యాదు

Landlords Threatened Take Down The Photo Of Pm Modi

Updated On : March 30, 2022 / 2:54 PM IST

landlords threatened Take Down The photo of PM Modi: సార్..వీడు నా పెన్సిల్ దొంగిలించాడు వీడిమీద కేసు పెట్టండి అంటూ ఓ బుడ్డోడు ఏపిలోని కర్నూలు పోలీసులకు చేసిన ఫిర్యాదు వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో తెలిసిందే. ఓ వ్యక్తి సార్..మా ఊర్లో రోడ్డు కనిపించట్లేదు అంటూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటువంటి వింత వింత ఫిర్యాలు పోలీసులకువస్తుంటాయి. అటువంటి ఓ వింత ఫిర్యాదు అందింది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులకు..ఏమా ఫిర్యాదు? ఏమా కథ అంటే..

Also read : Buddha Venkanna: టీవీల్లో కొడాలినానిని చూస్తే పిల్లలు బూచోడు అంటున్నారు: బుద్ధా వెంకన్న

ఇండోర్‌లోని పీర్‌ గలి నివాసి యూసుఫ్‌ మంగళవారం (మార్చి 29,2022)పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఒక విచిత్రమైన ఫిర్యాదు చేశాడు. ‘సార్ నాకు ప్రధాని నరేంద్ర మోడీ అంటే చాలా చాలా ఇష్టం. ఆయన సిద్ధాంతాలు అంటే అంతకంటే ఎక్కువ గౌరవం. ఆ గౌరవంతోనే నేను అద్దెకు తీసుకుంటున్న ఇంట్లో మోడీ ఫోటో పెట్టుకున్నాను. కానీ కొంతమంది వ్యక్తులు మా ఇంట్లో పెట్టుకున్న మోడీ ఫోటో తీసేమని బెదిరిస్తున్నారు’అంటూ ఫిర్యాదు చేశాడు.

Also read : Rajasthan : ఆస్పత్రిలో గర్భిణీ మృతి..మనస్తాపంతో మహిళా డాక్టర్ ఆత్మహత్య

మేం ఉంటున్న ప్రాంతంలో ఉన్న కొంతమంది భూస్వాములు యాకూబ్ మన్సూరి సుల్తాన్ మన్సూరీ ప్రధాని మోదీ ఫోటోని తీసివేయాలని ఒత్తిడి చేయడమే కాకుండా తీయకపోతే ఇంట్లోంచి గెట్టేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులకు చెప్పుకుని వాపోయాడు. దీంతో డీసీపీ మనీషా పాఠక్ యూసుఫ్ ఫిర్యాదు మేరకు సదర్ బజార్ టీఐని దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించారు.