Policybazaar: బీ అలర్ట్.. హ్యాకింగ్ గురైన పాలసీబజార్ ఐటీ సిస్టమ్

పాలసీబజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ మాతృ సంస్థ అయిన PB ఫిన్‌టెక్, సంస్థ IT సిస్టమ్ జూలై 19న హ్యాకింగ్ గురైందని యాజమాన్యం తెలిపింది. తక్కువ సమయంలోనే దిద్దుబాటు చర్యలు చేపట్టామని ఆదివారం స్పష్టం చేసింది.

Policybazaar: బీ అలర్ట్.. హ్యాకింగ్ గురైన పాలసీబజార్ ఐటీ సిస్టమ్

Policy Bazar

Policybazaar: పాలసీబజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ మాతృ సంస్థ అయిన PB ఫిన్‌టెక్, సంస్థ IT సిస్టమ్ జూలై 19న హ్యాకింగ్ గురైందని యాజమాన్యం తెలిపింది. తక్కువ సమయంలోనే దిద్దుబాటు చర్యలు చేపట్టామని ఆదివారం స్పష్టం చేసింది. జూలై 19న కొందరు హ్యాకర్లు నెట్‌వర్క్‌కు చట్టవిరుద్ధమైన.. అనధికారిక యాక్సెస్‌కు పాల్పడేందుకు ప్రయత్నించినట్లు కంపెనీ గుర్తించింది.

“వెంటనే పాలసీబజార్ సంబంధిత అధికారులను సంప్రదించడమే కాక చట్టం ప్రకారం తగిన సహాయం తీసుకుంటోంది. గుర్తించిన లూప్ హోల్స్ ను సాల్వ్ చేశారు. సిస్టమ్‌ల సమగ్ర సమాచారం భద్రంగా ఉంది” అని బీమా బ్రోకరేజ్ సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. .

సమాచార భద్రతా బృందం ప్రస్తుతం బాహ్య సలహాదారులతో కలిసి విషయాన్ని సమీక్షిస్తున్నట్లు తెలిపింది.

Read Also: పాలసీబజార్‌కు రూ.24లక్షల ఫైన్.. ఆ ఎస్మెమ్మెస్‌లే కారణం

“వివరణాత్మక సమీక్షను చేపట్టే ప్రక్రియలో ఉండగా, ఇప్పటివరకూ, ముఖ్యమైన కస్టమర్ డేటా ఏదీ బహిర్గతం కాలేదని కనుగొన్నాం. పాలసీబజార్ ఎప్పుడూ దాని సిస్టమ్‌ల భద్రత, కస్టమర్ డేటా రక్షణకు కట్టుబడి ఉంది” అని పేర్కొంది.