Ponguleti Srinivas Reddy : కాంగ్రెస్‌ గూటికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి?

ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల ముఖ్య నేతలతో పొంగులేటి ఎస్‌.ఆర్‌.కన్వెన్షన్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

Ponguleti Srinivas Reddy : కాంగ్రెస్‌ గూటికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి?

Srinivas Reddy

Updated On : June 9, 2023 / 8:23 AM IST

Congress Srinivas Reddy  : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు. పొంగులేటి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. మెజార్టీ అనుచరుల నిర్ణయం మేరకు కాంగ్రెస్ లో చేరాలని పొంగులేటి డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ లో చేరికపై జన్ 12న ప్రకటన చేయనున్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల ముఖ్య నేతలతో పొంగులేటి ఖమ్మంలోని ఎస్‌.ఆర్‌.కన్వెన్షన్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. జూన్ 28 తర్వాత కాంగ్రెస్ లో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Fish Prasadam : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. తర్వాత జూపల్లి కృష్ణారావుతో కలిసి పొంగులేటి రాష్ట్రంలో ఆత్మీయ సమేశాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం, వనపర్తితోపాటు పలు జిల్లాల్లో ఇద్దరూ కలిసి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

గత నెల (ఏప్రిల్)లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కొత్తగూడెంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఏప్రిల్ 10న వారిద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.