Ponguleti – Jupalli : ఢిల్లీ వెళ్లిన పొంగులేటి, జూపల్లి.. రాహుల్‌తో సహా కాంగ్రెస్ పెద్దలతో భేటీ.. రేవంత్, సీనియర్ నేతలకు అధిష్టానం పిలుపు

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఢిల్లీ వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం 3గంటల సమయంలో రాహుల్ గాంధీతో వీరు భేటీ కానున్నారు.

Ponguleti – Jupalli : ఢిల్లీ వెళ్లిన పొంగులేటి, జూపల్లి.. రాహుల్‌తో సహా కాంగ్రెస్ పెద్దలతో భేటీ.. రేవంత్, సీనియర్ నేతలకు అధిష్టానం పిలుపు

Ponguleti - Jupalli

TS Congress: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యేందుకు ఇరువురు నేతలు తమ అనుచరులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాహుల్ గాంధీతో వీరు భేటీ అవుతారు. ఆ తరువాత ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులను, ముఖ్యనేతలను పొంగులేటి, జూపల్లి కలుస్తారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పెద్దలతో భేటీ తరువాత ఇరువురు నేతలు మీడియా ముందు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Telangana Congress : కోమటిరెడ్డి వెంకట రెడ్డితో కలిసి జూపల్లి ఇంటికి రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీతో భేటీలో పలు అంశాలపై పొంగులేటి, జూపల్లి చర్చించే అవకాశం ఉంది. పార్టీలో చేరితే తమకు, తమ వర్గానికి ఇచ్చే ప్రాధాన్యత, తదితర అంశాలపై రాహుల్ వద్ద ఇరువురు నేతలు ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో పాల్గొనాలని రాహుల్, ప్రియాంకలను వారు ఆహ్వానించనున్నారు. వచ్చే నెల 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమైనట్లు సమాచారం.

మరోవైపు, ఖమ్మం సభలోనే పొంగులేటితో పాటు జూపల్లి చేరిక ఉంటుందా? లేక మహబూబ్ నగర్ లో బహిరంగ సభ ద్వారా జూపల్లి, ఆయన వర్గీయుల చేరిక ఉంటుందా అనేది రాహుల్, కాంగ్రెస్ పెద్దలతో భేటీ తరువాత స్పష్టం వచ్చే అవకాశం ఉంది. రెండు ప్రాంతాల్లో వేరువేరు సభలు నిర్వహిస్తే అవి ఒకేరోజు ఉంటాయా? వేరువేరు రోజుల్లో ఉంటాయా అనే అంశంపైనా కాంగ్రెస్ పెద్దలతో జూపల్లి, పొంగులేటి భేటీ తరువాత స్పష్టత రానుంది.

Ponguleti Srinivas Reddy : తెలంగాణలో ఆట మొదలుకాబోతోంది, బీజేపీలోకి ఎందుకు వెళ్ల లేదంటే- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

సోమవారం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పొంగులేటి, జూపల్లి భేటీ కానున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల పార్టీ నేతలకు ఢిల్లీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలతో పాటు, జానారెడ్డి, షబ్బీర్ అలీ, రేణుకాచౌదరిసహా 12 మంది సీనియర్ నేతలతో ఢిల్లీ పెద్దలు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిణామాలు, రాజకీయ పరిస్థితులు, పార్టీ పురోగతి వంటి అంశాలపై వారు చర్చించవచ్చునని సమాచారం.