PM Modi Tweet : ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వంపై ప్రధాని మోదీ ట్వీట్

అట్టడుగు సమస్యలపై ఆమెకు ఉన్న అవగాహన, అభివృద్ధి విజన్ అత్యద్భుతమని కొనియాడారు. ప్రధాని మోదీ, అమిత్ షాను ద్రౌపది ముర్ము కలిశారు.

PM Modi Tweet : ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వంపై ప్రధాని మోదీ ట్వీట్

Modi

PM Modi tweet : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ద్రౌపది ముర్ము ఎంపికను దేశంలో అన్ని వర్గాలు ప్రశంసించాయని తెలిపారు. అట్టడుగు సమస్యలపై ఆమెకు ఉన్న అవగాహన, అభివృద్ధి విజన్ అత్యద్భుతమని కొనియాడారు. ప్రధాని మోదీ, అమిత్ షాను ద్రౌపది ముర్ము కలిశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీకి ద్రౌపది ముర్ము కృతజ్ఞతలు తెలిపారు.

మోదీ గవర్నమెంట్ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి, గిరిజన జాతి నాయకురాలు ద్రౌపది ముర్ము జులైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాకు పోటీ ఇవ్వనున్నారు. ఒకవేళ 64ఏళ్ల ద్రౌపది గెలిస్తే.. ఇండియాకు ప్రెసిడెంట్ అయిన తొలి గిరిజన మహిళగా ఘనత సాధిస్తారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ ప్రెసిడెన్షియల్ నామినీగా 20మంది పేర్లను చర్చించింది. అందులో తూర్పు భారతదేశానికి చెందిన, గిరిజన మహిళను ఎంచుకున్నట్లు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తెలిపారు.

presidential election: ఢిల్లీ చేరుకున్న ద్రౌప‌ది ముర్ము.. రేపు నామినేష‌న్ దాఖలు

ద్రౌపది ముర్ము.. జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్ గా 2015లో నియమితులయ్యారు. రెండు సార్లు బీజేపీ అభ్యర్థిగా లెజిస్లేటర్ ఎన్నికల్లో ఎంపికయ్యారు. నవీన్ పట్నాయక్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. బీజేపీ సహకారంతో బిజూ జనతా దళ్ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా సేవలు అందించారు. ఒడిశా ప్రభుత్వంలో రవాణా, వాణిజ్యం, మత్స్య పరిశ్రమ, పశుసంవర్ధక మంత్రిత్వ శాఖలను నిర్వహించడం ద్వారా ఆమెకు విభిన్న శాఖల్లో పరిపాలనా అనుభవం ఉంది.

కౌన్సిలర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ముర్ము.. తరువాత రాయంగ్‌పూర్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ లేదా NAC వైస్-ఛైర్‌పర్సన్‌గా మారారు. 2013లో ఒడిశాలోని పార్టీ షెడ్యూల్ తెగ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు స్థాయికి ఎదిగారు. భువనేశ్వర్-రమా దేవి మహిళా కాలేజీ నుంచి ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె.. దాదాపు రెండు దశాబ్దాలపాటు రాజకీయాల్లో ఉండి సామాజిక సేవ చేస్తున్నారు.