Raavanasura : రవితేజ పక్కన ఫిక్స్ అయ్యారంటగా..

మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ మూవీలో హీరోయిన్లుగా ఫరియా అబ్దుల్లా, ప్రియాంక అరుల్ మోహన్..

Raavanasura : రవితేజ పక్కన ఫిక్స్ అయ్యారంటగా..

Raavanasura

Updated On : December 30, 2021 / 1:30 PM IST

Raavanasura: మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది ‘క్రాక్’తో బ్లాక్‌బస్టర్ కొట్టి మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు.. పాండమిక్ తర్వాత టాలీవుడ్‌కి కొత్త శుభారంభాన్ని తీసుకొచ్చాడు. ప్రస్తుతం వరుసగా సినిమాలు లైనప్ చేస్తూ బిజీగా ఉన్నారు.

Daakko Daakko Meka : ‘దాక్కో దాక్కో దాక్కో మేక’ వీడియో సాంగ్ వచ్చేసింది..

రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’, కొత్త డైరెక్టర్ శరత్ మండవ డైరెక్షన్లో ‘రామారావు – ఆన్ డ్యూటీ’, త్రినాధరావు నక్కినతో ‘ధమాకా’, వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు చేస్తున్నారు. ‘ఖిలాడీ’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇటీవలే సుధీర్ వర్మతో మరో సినిమా అనౌన్స్ చేశారు.

Nivetha Thomas : ‘జై బాలయ్య’ పాటకు నివేదా థామస్ డ్యాన్స్! వీడియో వైరల్

రవితేజ హీరోగా నటిస్తున్న 70వ సినిమా ఇది. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘రావణాసుర’ అనే పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

Raviteja 71 : ‘టైగర్ నాగేశ్వరరావు’ గా మాస్ మహారాజా!

లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ‘రావణాసుర’ లో మాస్ మహారాజా ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చెయ్యబోతున్నారట. హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా, చెన్నై పొన్ను ప్రియాంక అరుల్ మోహన్ ఇద్దరినీ హీరోయిన్లుగా కన్ఫమ్ చేశారని టాక్. ‘జాతిరత్నాలు’ బ్లాక్‌బస్టర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ లో నటించిన ఫరియా.. ‘బంగార్రాజు’ లో నాగార్జున, నాగ చైతన్యలతో స్పెషల్ సాంగ్ చేసింది. ప్రియాంక తమిళ్‌లో స్టార్ హీరో సూర్య పక్కన Etharkkum Thunindhavan మూవీలో నటిస్తోంది.

Kinnerasani Trailer : ‘ఇది కథ కాదు.. ప్రతి అక్షరం నిజం’..