OTT Realeses : నిర్మాతలు ఫిక్స్.. 50 రోజుల తర్వాతే ఓటీటీకి..

తాజాగా టాలీవుడ్ నిర్మాతలు అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం సాయంత్రం చలన చిత్ర వాణిజ్య మండలిలో నిర్మాతలు సమావేశమయ్యారు. టికెట్‌ ధరలు, డిజిటల్‌ కంటెంట్‌ ప్రొవైడింగ్‌కి సంబంధించిన విషయాలు, ఓటీటీలో............

OTT Realeses : నిర్మాతలు ఫిక్స్.. 50 రోజుల తర్వాతే ఓటీటీకి..

Ott

OTT Realeses :  కరోనా రావడంతో ఓటీటీకి మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో చాలా సినిమాలు కరోనా టైంలో థియేటర్లు లేక డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. థియేటర్లు ఓపెన్ అయ్యాక కూడా కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వడంతో థియేటర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో థియేటర్లో రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలకు అమ్మేస్తున్నారు నిర్మాతలు. మంచి డీల్ వస్తుండటంతో చాలా తొందరగా ఓటీటీలకు ఇచ్చేస్తున్నారు. ఇక చిన్న సినిమాలు, ఫ్లాప్ అయిన సినిమాలు అయితే రెండు వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి.

నిర్మాతలు వాళ్ళ లాభం కోసం సినిమాలని తొందరగా ఓటీటీలకు ఇస్తున్నారు. దీని వల్ల కలెక్షన్స్ తగ్గుతున్నాయి, థియేటర్లకు జనాలు రావడం తగ్గించేశారు. ఎలాగో తొందరగా ఓటీటీలో వస్తుంది కదా అని థియేటర్లకు వెళ్లడం మానేస్తున్నారు ప్రేక్షకులు. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోతున్నారు. సినిమాలకి కలెక్షన్స్ కూడా రాకపోవడంతో గత కొన్ని రోజులుగా దీనిపై పరిశ్రమలో చర్చ జరుగుతుంది.

Shivani Rajashekar : చదువు కోసం మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకున్న శివాని రాజశేఖర్..

తాజాగా టాలీవుడ్ నిర్మాతలు అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం సాయంత్రం చలన చిత్ర వాణిజ్య మండలిలో నిర్మాతలు సమావేశమయ్యారు. టికెట్‌ ధరలు, డిజిటల్‌ కంటెంట్‌ ప్రొవైడింగ్‌కి సంబంధించిన విషయాలు, ఓటీటీలో సినిమా రిలీజ్ లు.. ఇలా పలు విషయాలని చర్చించారు. సమావేశం అనంతరం నిర్మాతలు ఓటీటీ విడుదలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమాలు రిలీజ్ అయిన యాభై రోజుల తర్వాతే ఓటీటీల్లో ప్రదర్శించేలా ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించారు. జులై 1 తర్వాత ఒప్పందాలు చేసుకునే సినిమాలన్నిటికీ ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. దీంతో థియేటర్లకు లాభం చేకూరనుంది. అయితే ఇది కేవలం పెద్ద సినిమాలకేనా చిన్న సినిమాలకి కూడా వర్తిస్తుందా తెలుపలేదు.