Gangula Kamalakar: బీజేపీ వాళ్లు ఢిల్లీలో ధర్నా చెయ్యాలి.. బియ్యం కేంద్రమే కొనాలి -మంత్రి గంగుల

రైతాంగంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని అన్నారు బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.

Gangula Kamalakar: బీజేపీ వాళ్లు ఢిల్లీలో ధర్నా చెయ్యాలి.. బియ్యం కేంద్రమే కొనాలి -మంత్రి గంగుల

Gangula Kamalakar

Gangula Kamalakar: రైతాంగంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని అన్నారు బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. బీజేపీ పార్టీ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నదని మంత్రి గంగుల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ధాన్యం కొంటదా? కొనదా? కేంద్రం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు గంగుల.

రైతులు పండించే వానాకాలం పంట ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా 6,663 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివకే 5.15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నామని వెల్లడించారు. బీజేపీ పార్టీ అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా చేపట్టడం.. వానాకాలం పంట కొనాలని ధర్నా చేయడం హాస్యాస్పదమన్నారు గంగుల.

Bigg Boss : బిగ్ బాస్ లో సూసైడ్ అటెంప్ట్ చేసిన కంటెస్టెంట్

ఎక్కడ ధాన్యం కొనకున్నా మంత్రిగా నాదే భాద్యతయని అన్నారు. గతేడాది 6వేల 500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పిన గంగుల.. ఈ ఏడాది 6663 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈసారి పెద్ద ఎత్తున పంట వచ్చిందని, ఇప్పటికే 3వేల 550 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు గంగుల. 17 తేమశాతం ఉంటే కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తరలిస్తున్నారు. ధాన్యం 17 తేమ శాతం నిబంధన FCI పెట్టిందేనని గంగుల చెప్పారు.

Cryptocurrency: క్రిప్టోకరెన్సీ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం.. ఆర్‌బీఐ గవర్నర్ హెచ్చరిక!

ఇప్పటికే 5 లక్షల 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని స్పష్టంచేశారు గంగుల. వెయ్యి కోట్ల ధాన్యాన్ని ఇప్పటికే కొన్నామని, రైతులను మభ్య పెట్టి చేసే ధర్నాకు బీజేపీనే సమాధానం చెప్పాలన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ధర్నాలు ఢిల్లీలో చేయాలని, తెలంగాణలో కాదన్నారు గంగుల. అబద్దాల మీదే బీజేపీ బతుకుతుందని, తెలంగాణ రైతాంగం ఈ విషయాన్ని గమనించాలన్నారు. వడ్లు తాము కొంటున్నామని, బియ్యం తీసుకోవల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని స్పష్టం చేశారు గంగుల. యాసంగి పంట మొత్తం కేంద్రమే కొనాలని డిమాండ్‌ చేశారు.