Governor Tamilisai : భద్రాద్రిలో గవర్నర్.. ప్రోటోకాల్ వివాదం

రాములోరి పట్టాభిషేకం కార్యక్రమానికి వెళ్లిన ఆమెకు కలెక్టర్, జిల్లా ఎస్పీ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో జాయింట్ కలెక్టర్, ఏఎస్పీ హాజరై స్వాగతం పలికారు...

Governor Tamilisai : భద్రాద్రిలో గవర్నర్.. ప్రోటోకాల్ వివాదం

Bhadradri

Protocol Controversy Over Telangana Governor : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై పర్యటనలో మరోసారి ప్రోటోకాల్ వివాదం రేపుతోంది. గత కొన్ని రోజులుగా ఆమె పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రోటోకాల్ పాటించకపోవడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా.. 2022, ఏప్రిల్ 11వ తేదీ సోమవారం భద్రాద్రి పర్యటనకు గవర్నర్ తమిళిసై వెళ్లారు. రాములోరి పట్టాభిషేకం కార్యక్రమానికి వెళ్లిన ఆమెకు కలెక్టర్, జిల్లా ఎస్పీ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో జాయింట్ కలెక్టర్, ఏఎస్పీ హాజరై స్వాగతం పలికారు. భద్రాచలం దేవస్థానంలో జరిగే సీతారామచంద్ర స్వామి పట్టాభిషేక కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై హాజరయ్యారు. అనంతరం భద్రాచలంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్‌లో వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించే గిరిజన మహిళల సంప్రదాయ సీమంతం వేడుకకు వెళ్తారు. అనంతరం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న రక్తనిధిని గవర్నర్‌ సందర్శించి దాని పనితీరును సమీక్షిస్తారు. ఆ తరువాత దమ్మాయిపేట మండలం నాచారం గ్రామం జగదాంబ సహిత జయలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. మంగళవారం పూసుకుంట కొండరెడ్డి గిరిజన ఆవాసాలను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మణుగూరు హెవీ వాటర్‌ ప్లాంట్‌ను గవర్నర్‌ తమిళిసై సందర్శిస్తారు.

Read More : Tamilisai : భద్రాద్రికి గవర్నర్ తమిళిసై

గతంలో కూడా పలు సందర్భాల్లో ప్రోటోకాల్ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అన్నట్లుగా మారిపోయింది. ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన గవర్నర్ తమిళి సై.. కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న అవమానాలు, తన పర్యటనల్లో అధికారుల ప్రోటోకాల్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కొంతకాలంగా రాజ్ భవన్ నుంచి వచ్చే ఆదేశాలను.. గవర్నర్ పర్యటనలను అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

Read More : TS Governor Tamilisai : ‘మహిళా గవర్నర్ ని అని తెలంగాణ ప్రభుత్వం నాపై వివక్ష చూపుతోంది.. ప్రోటోకాల్ పాటించట్లేదు’

మేడారం, యాదాద్రి పర్యటనలో ప్రోటోకాల్ పాటించలేదు. ఇటీవలే అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యాయి. రాజ్ భవన్ లో జరిగే వేడుకలకు కూడా సీఎం, ఇతరులు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ స్థానం క్లియర్ చేయకపోవడం దగ్గరి నుంచి.. ఉగాది వేడుకల వరకు జరిగిన అన్ని విషయాలపై తన స్టాండ్ ఏంటో చెప్పేశారు గవర్నర్ తమిళి సై. ప్రభుత్వం పంపించిన వాటిల్లో కొన్నింటిని ఆమోదించకపోతే.. రాజ్ భవన్ ను, గవర్నర్ ను అవమానిస్తారా ? అంటూ ప్రశ్నించారు. మరి భద్రాద్రి పర్యటనలో కూడా ప్రోటోకాల్ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.