Polling Time Extened : తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. ఈసీ కీలక నిర్ణయం

కాగా.. సమస్యాత్మక, ఏజెన్సీ, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుందని స్పష్టం చేసింది.

Polling Time Extened : తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. ఈసీ కీలక నిర్ణయం

Polling time (Photo Credit : Google)

Polling Time Extened : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని పొడిగించింది ఎన్నికల సంఘం. పోలింగ్ సమయాన్ని గంటపాటు పొడిగించింది. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ప్రకటించింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ సమయాన్ని పొడిగించాలంటూ రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తితో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా.. సమస్యాత్మక, ఏజెన్సీ, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుందని స్పష్టం చేసింది. మే 13న లోక్ సభ స్థానాలకు తెలంగాణలో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ కు సమయం ఇచ్చింది. తాజాగా ఆ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు.

Also Read : కేసీఆర్‌కు ఈసీ బిగ్ షాక్.. ఎన్నికల ప్రచారంపై నిషేధం