Sankranti Special Trains 2026 : సంక్రాంతి వేళ హైదరాబాద్ నుంచి వెళ్లే రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దక్షిణమధ్య రైల్వే కీలక నిర్ణయం

Sankranti Special Trains 2026 : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే నగర వాసులకు దక్షిణమధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది.

Sankranti Special Trains 2026 : సంక్రాంతి వేళ హైదరాబాద్ నుంచి వెళ్లే రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దక్షిణమధ్య రైల్వే కీలక నిర్ణయం

Special Trains

Updated On : January 6, 2026 / 8:44 AM IST
  • సంక్రాంతి పండుగ వేళ రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్
  • హైటెక్ సిటీ, చర్లపల్లి రైల్వే స్టేషన్‌లలో ఆగనున్న 27 ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్
  • ఈ సదుపాయం ఈనెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు

Sankranti Special Trains 2026 : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే నగర వాసులకు దక్షిణమధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగర ప్రయాణికులకు ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది.

Also Read : Sankranti Holidays: తెలంగాణలో విద్యార్థులకు సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎప్పటినుంచి, ఎప్పటివరకంటే?

సికింద్రాబాద్, లింగంపల్లి నుంచి నడిచే 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్ సిటీ స్టేషన్‌లో, సికింద్రాబాద్ – విజయవాడ మార్గంలో నడిచే మరో 11 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు చర్లపల్లిలో ప్రత్యేక హాల్ట్‌లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. ఈ సదుపాయం ప్రయాణికులకు ఈనెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో ఆగనున్న రైళ్లలో.. మచిలీపట్నం- బీదర్ ఎక్స్‌ప్రెస్, నర్సపూర్- లింగంపల్లి ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి- విశాఖపట్నం జన్మభూమి, కాకినాడ టౌన్- లింగంపల్లి గౌతమి, సాయినగర్- మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, సాయిన గర్ – కాకినాడ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం – ముంబై ఎన్టీటీ ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం – సాయినగర్, కాకినాడ – సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి- కాకినాడ టౌన్ కాకినాడ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం – లింగంపల్లి జన్మభూమి, ముంబై-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి- కాకినాడ గౌతమి ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి – నర్సాపుర్ ఎక్స్‌ప్రెస్, బీదర్- మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.

చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆగే రైళ్లలో.. సికింద్రాబాద్- గూడూరు- సికింద్రాబాద్ సింహపురి, కాకినాడ- లింగంపల్లి-కాకినాడ గౌతమి, కాకినాడ- లింగంపల్లి- కాకినాడ కాకినాడ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్- విశాఖపట్నం- సికింద్రాబాద్ గరీభ్‌రథ్, సికింద్రాబాద్- భువనేశ్వర్ విశాఖ, హైదరాబాద్- విశాఖపట్నం గోదావరి, తిరుపతి- సికింద్రాబాద్- తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఈనెల 20వ తేదీ వరకు ఆగనున్నాయి.