Republic Day Parade: గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు పంజాబ్ శకటాన్ని తిరస్కరించిన కేంద్రం
గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం పంజాబ్ ప్రభుత్వం రూపొందించిన శకటాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ప్రతి ఏటా ఎంతో గర్వంగా నిర్వహించే ఈ పరేడ్‌లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖల శకటాలు పాల్గొంటాయి. తమ ప్రత్యేకతను తెలిపేలా శకటాల్ని రూపొందించి గణతంత్ర పరేడ్కి పంపిస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వాటికి మాత్రమే పరేడ్‌లోకి అనుమతి ఉంటుంది

Punjab's tableau rejected for Republic Day parade
Republic Day Parade: గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం పంజాబ్ ప్రభుత్వం రూపొందించిన శకటాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ప్రతి ఏటా ఎంతో గర్వంగా నిర్వహించే ఈ పరేడ్‌లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖల శకటాలు పాల్గొంటాయి. తమ ప్రత్యేకతను తెలిపేలా శకటాల్ని రూపొందించి గణతంత్ర పరేడ్కి పంపిస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వాటికి మాత్రమే పరేడ్‌లోకి అనుమతి ఉంటుంది. ప్రతి ఏడాది కొన్ని ఇలా తిరస్కరణకు గురవుతూనే ఉంటాయి. అయితే పంజాబీ సంస్కృతిని తెలియజేసేలా రూపొంది పంపిన శకటానికి అనుమతి ఇవ్వకపోడంపై ఆధికార పార్టీ ఆప్ సహా శిరోమణి అకాలీ దళ్, పంజాబీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక గణతంత్ర వేడుకలు మరొక రోజు ఉందనగానే ఢిల్లీలో వివిధ రాష్ట్రాల శకటాలు రిహార్సల్స్‌తో అదరగొట్టాయి. దాదాపు అన్ని రాష్ట్రాల శకటాలు, సైనిక విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
Elon Musk: ట్విట్టర్‌కు ఎలన్ మస్క్ దెబ్బ.. డిసెంబర్లో 71 శాతం పడిపోయిన ఆదాయం