Pushpa : ‘పుష్ప’ రాజ్.. అస్సలు ‘తగ్గట్లే’దుగా..

కాసేపటి క్రితం వరకు మోస్ట్ యాంటిసిపెటెడ్ ఇండియన్ మూవీగా IMDB ర్యాంకింగ్‌లో రెండో ప్లేస్‌లో ఉన్న ‘పుష్ప’ ప్రస్తుతం ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చేసింది..

Pushpa : ‘పుష్ప’ రాజ్.. అస్సలు ‘తగ్గట్లే’దుగా..

Pushpa

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప రాజ్’ గా రిలీజ్‌కి ముందే రేర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. బన్నీ, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. కన్నడ చిన్నది రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది.. వెర్సటైల్ మలయాళీ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.

‘పుష్ప రాజ్’ ఇంట్రో వీడియోకి రిలీజ్ చేసిన అన్ని భాషల్లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ రావడమే కాక.. ఫాస్టెస్ట్ 70+ మిలియన్ వ్యూస్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు రిలీజ్‌కి ముందే మరో రేర్ ఫీట్ సాధించాడు ‘పుష్ప రాజ్’. కాసేపటి క్రితం వరకు మోస్ట్ యాంటిసిపెటెడ్ ఇండియన్ మూవీగా IMDB ర్యాంకింగ్‌లో రెండో ప్లేస్‌లో ఉన్న ‘పుష్ప’ ప్రస్తుతం ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చేసింది. ఈ ర్యాంకింగ్‌తో ‘పుష్ప’ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Pushpa : ‘పుష్ప’ కోసం ఓవరాల్ ఇండియా వెయిట్ చేస్తోంది..!

కథ ప్రకారం వివరంగా చెప్పడం కోసం ‘పుష్ప’ సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ చెయ్యబోతున్నారు. కేవలం తెలుగు ఆడియెన్స్, బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. ఓవరాల్ ఇండియన్ మూవీ లవర్స్ ‘పుష్ప’ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ ‘పుష్ప’ షూటింగ్ త్వరలో పున: ప్రారంభం కానుంది.