India-China Clash: 37 వేల చ.కి.మీ ప్రాంతాన్ని చైనా ఆక్రమించినప్పుడు మీ తాత నిద్రపోతున్నారా? రాహుల్ గాంధీకి బీజేపీ కౌంటర్

మన దేశంలోని 37 వేల చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించినప్పుడు రాహుల్ గాంధీ ముత్తాత నిద్రపోయారు. వాస్తవానికి చైనా ఏం చేయబోతోందో రాహుల్ గాంధీకి తెలుసు. ఎందుకంటే, ఆ దేశానికి వాళ్లు చాలా దగ్గరి వాళ్లు. అది మొన్ననే రుజువైంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్‭కు 135 కోట్ల రూపాయలు అందాయి

India-China Clash: 37 వేల చ.కి.మీ ప్రాంతాన్ని చైనా ఆక్రమించినప్పుడు మీ తాత నిద్రపోతున్నారా? రాహుల్ గాంధీకి బీజేపీ కౌంటర్

Rahul Gandhi's maternal grandfather was sleeping when India lost 37,000 sq km to China

Updated On : December 16, 2022 / 8:57 PM IST

India-China Clash: చైనా వివాదంపై మోదీ ప్రభుత్వం నిద్రపోతుందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. 1969లో మన దేశంలోని 37 వేల చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించినప్పుడు రాహుల్ గాంధీ ముత్తాత, ఈ దేశ మొదటి ప్రధానమంత్రి జవహార్‭లాల్ నెహ్రూ నిద్రపోయారని బీజేపీ నేత రాజ్యవర్ధన్ రాథోడ్ విమర్శించారు. చైనా ఆక్రమణలను మోదీ ప్రభుత్వం తిప్పి కొడుతోందని, గాల్వాన్ లోయలో ఎదురైన అనుభవమే నేడు అరుణాచల్ ప్రదేశ్‭లోనూ రిపీట్ అయిందని ఆయన అన్నారు.

Rahul Gandhi: ఆప్ కనుక లేకపోయుంటేనా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

‘‘మన దేశంలోని 37 వేల చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించినప్పుడు రాహుల్ గాంధీ ముత్తాత నిద్రపోయారు. వాస్తవానికి చైనా ఏం చేయబోతోందో రాహుల్ గాంధీకి తెలుసు. ఎందుకంటే, ఆ దేశానికి వాళ్లు చాలా దగ్గరి వాళ్లు. అది మొన్ననే రుజువైంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్‭కు 135 కోట్ల రూపాయలు అందాయి. అందుకే రాహుల్ అలా మాట్లాడుతున్నారు. అయితే నేను ఒక విషయం స్పష్టం చేయానుకుంటున్నాను. నెహ్రూలా మోదీ వ్యవహరించరు. చైనాకు ధీటైన సమాధానం చెప్తారు. గాల్వాన్ లోయలో ఎదురైన అనుభవమే నేడు అరుణాచల్ ప్రదేశ్‭లోనూ రిపీట్ అయింది’’ అని రాజ్యవర్ధన్ రాతోడ్ అన్నారు.

The Supreme Court: విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డందుకు 18 ఏళ్ల జైలు శిక్ష.. ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం

దీనికి ముందు రాజస్తాన్ రాజధాని జైపూర్‭లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ ‘‘సరిహద్దు రక్షణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పాకిస్తాన్, చైనా దేశాలు మాటిమాటికీ చొరబడేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం మౌనం వహిస్తోంది. చైనా యుద్ధానికి సన్నద్ధం అవుతుంటే, మోదీ ప్రభుత్వం మాత్రం నిద్రపోతోంది. చైనాకు సరైన గుణపాఠం చెప్పేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. చైనాకు మోదీ భయపడుతున్నారు’’ అని అన్నారు.