Bombay High Court: ప్రయాణికుల రద్దీ కారణంగా రైలులోంచి పడి వ్యక్తి గాయపడితే రైల్వేలు నష్టపరిహారం చెల్లించాల్సిందే: బాంబే హైకోర్టు

రైలులో ప్రయాణికుల రద్దీ కారణంగా ఎవరైనా ప్రయాణికుడికి చోటు లభించక..అతను రైలులో నుంచి పడిపోయి గాయపడితే అందుకు రైల్వేలు ఆ ప్రయాణికుడికి పరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది

Bombay High Court: ప్రయాణికుల రద్దీ కారణంగా రైలులోంచి పడి వ్యక్తి గాయపడితే రైల్వేలు నష్టపరిహారం చెల్లించాల్సిందే: బాంబే హైకోర్టు

Bomaby

Bombay High Court: రైలులో ప్రయాణికుల రద్దీ కారణంగా ఎవరైనా ప్రయాణికుడికి చోటు లభించక..అతను రైలులో నుంచి పడిపోయి గాయపడితే అందుకు రైల్వేలు ఆ ప్రయాణికుడికి పరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. “బాగా రద్దీగా ఉన్న రైలుకి టికెట్ ఇచ్చి తాను కూర్చునేందుకు కూడా సీటు లేక..ప్రయాణికుల తోపులాటకు..కదులుతున్న రైలులో నుంచి కింద పడి గాయపడ్డా, అందుకు నాకు పశ్చిమ రైల్వే(వెస్ట్రన్ రైల్వే) నుంచి నష్టపరిహారం ఇప్పించండి” అంటూ ఓ ప్రయాణికుడు కోర్టులో వేసిన పిటిషన్ పై బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. దాదాపు 11 ఏళ్ల నాటి ఈ ఘటన పై ఏప్రిల్ 12న బాంబే హైకోర్ట్ తుది తీర్పు వెలువరించింది. రద్దీ ఉందని తెలిసి కూడా ప్రయాణికుడికి టికెట్ ఇచ్చి అతను గాయపడడానికి కారణమైన రైల్వే సంస్థ తప్పక పరిహారం చెల్లించాల్సిందేనని బాంబే హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ భారతి డాంగ్రే తీర్పు వెలువరించారు.

Also read:Corona in IIT Madras: నాలుగో దశలో చాపకింద నీరులా కరోనా విస్తరణ: ఐఐటీ మద్రాస్ క్యాంపస్ లో 111 యాక్టివ్ కేసులు

ఇది ముమ్మాటికీ అవాంఛనీయ ఘటనేనని..బాధితుడికి నష్టపరిహారం చెల్లించాలని పశ్చిమ రైల్వేశాఖను ఆదేశించింది. నితిన్ హుండివాలా అనే 75 ఏళ్ల వ్యక్తి..2011 నవంబర్ లో ముంబైలోని లోకల్ ట్రైన్ లోకి ఎక్కారు. అయితే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో తోపులాట జరిగి నితిన్ కిందపడ్డాడు. దీంతో ట్రైన్ ప్రవేశద్వారం వద్ద నిలుచున్నాడు నితిన్. ఇంతలోనే ట్రైన్ కదలడంతో పట్టు తప్పి.. నితిన్ ట్రైన్ లో నుంచి కింద పడ్డాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డ నితిన్..విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే నితిన్ డిమాండ్ పై విచారణ జరిపిన రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ అధికారులు..నష్టపరిహారం ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు.

Also read:AP High Court : మున్సిపల్ ఎన్నికల పిటిషన్లు పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి : ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

బాధితుడి ఫిర్యాదుపై లోతుగా విచారణ జరిపిన బాంబే హైకోర్టు..రద్దీ ఉన్న ట్రైన్ లోకి మరో ప్రయాణికుడికి టికెట్ ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ముంబై మహానగరానికి జీవన మార్గాలుగా చెప్పుకునే లోకల్ ట్రైన్ లలో నిత్యం లక్షలాది మంది ప్రజలు వారి వారి గమ్యస్థానాలకు చేరుకుంటారని..ఆ ట్రైన్లో ఖాళీ ఉందా లేదా, అనేది కూడా పట్టించుకునే అవకాశం లేకుండా వచ్చిన ట్రైన్లో ఎక్కేస్తుంటారని..అటువంటప్పుడు రైల్వే అధికారులే ప్రయాణికుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని జస్టిస్ భారతి డాంగ్రేతో కూడిన సింగల్ బెంచ్ వ్యాఖ్యానించింది. బాధితుడికి రూ.3 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని పశ్చిమ రైల్వేశాఖను కోర్టు ఆదేశించింది.

Also read:Covaxin : 6-12 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్.. DCGI అనుమతి!