Corona in IIT Madras: నాలుగో దశలో చాపకింద నీరులా కరోనా విస్తరణ: ఐఐటీ మద్రాస్ క్యాంపస్ లో 111 యాక్టివ్ కేసులు

ఐఐటీ మద్రాసు క్యాంపస్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. క్యాంపస్ పరిధిలోని హాస్టల్స్ లో గత వారం 32 యాక్టివ్ కేసులు మాత్రమే ఉండగా..ఈవారం ఆ సంఖ్య 111కి చేరింది.

Corona in IIT Madras: నాలుగో దశలో చాపకింద నీరులా కరోనా విస్తరణ: ఐఐటీ మద్రాస్ క్యాంపస్ లో 111 యాక్టివ్ కేసులు

Corna

Corona in IIT Madras: దేశంలో కరోనా మహమ్మారి నాలుగో దశ మొదలైందా? చాపకింద నీరులా ఇప్పటికే మహమ్మారి విస్తరించిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వెలువడుతుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర వైద్యారోగ్యశాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే కరోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. ఢిల్లీ, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని విద్యాసంస్థలు, ప్రైవేట్ కార్యాలయాల్లో కరోనా కొత్త కేసులు బయటపడగా..ఇటు దక్షిణాదిలోనూ కరోనా కేసులు పుట్టుకొస్తున్నాయి. ఐఐటీ మద్రాసు క్యాంపస్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

Also read:Covaxin : 6-12 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్.. DCGI అనుమతి!

క్యాంపస్ పరిధిలోని హాస్టల్స్ లో గత వారం 32 యాక్టివ్ కేసులు మాత్రమే ఉండగా..ఈవారం ఆ సంఖ్య 111కి చేరింది. క్యాంపస్ పరిధిలో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగడంపై విద్యార్థులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు తమిళనాడు రాష్ట్రంలోనూ కరోనా కొత్త కేసులు పెరుగుతుండడంపై తమిళనాడు ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. ఐఐటీ మద్రాస్ క్యాంపస్ లో విద్యార్థులు కరోనా భారిన పడడంపై రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ జె రాధాకృష్ణన్ స్పందిస్తూ..కరోనా నిర్ధారణ అయిన విద్యార్థులు ఇటీవల సొంత ఊళ్లకు వెళ్ళివచ్చారని పేర్కొన్నారు.

Also read:Food Crisis : భవిష్యత్‌లో తినడానికి తిండి కూడా దొరకదట.. వ్యవసాయ భూములు ఉండవట..!

రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను 14000 నుంచి 25000కు పెంచామని..కరోనా నియంత్రణకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు అనుసరించి ప్రజలు వ్యాక్సిన్ వేయించుకువలని..భౌతిక దూరం, మాస్క్ ధరించి మహమ్మారి నుంచి ప్రజలు రక్షణ పొందాలని ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ జె రాధాకృష్ణన్ సూచించారు.