Raj Tarun: ‘తిరగబడర స్వామి’ అంటోన్న రాజ్ తరుణ్!

‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్న రాజ్ తరుణ్, ఆ తరువాత లవర్ బాయ్‌గా మారిపోయాడు. ఇటీవల ‘ఆహ నా పెళ్లంట’ అనే వెబ్ మూవీలో నటించాడు ఈ హీరో. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను ఓకే చేసిన రాజ్ తరుణ్, తాజాగా ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించాడు.

Raj Tarun: ‘తిరగబడర స్వామి’ అంటోన్న రాజ్ తరుణ్!

Raj Tarun: ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్న రాజ్ తరుణ్, ఆ తరువాత లవర్ బాయ్‌గా మారిపోయాడు. వరుస హిట్స్‌తో కెరీర్‌లో జెట్ స్పీడుగా దూసుకుపోయాడు. అయితే కొంతకాలంగా ఈ హీరోకు సరైన హిట్లు లేక వెనకబడిపోయాడు. ఇటీవల ‘ఆహ నా పెళ్లంట’ అనే వెబ్ మూవీలో నటించాడు ఈ హీరో. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను ఓకే చేసిన రాజ్ తరుణ్, తాజాగా ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించాడు.

Raj Tarun: “పీటల దాకా వచ్చిన పెళ్లి పెటాకులు” అయ్యిందంటూ ఎమోషనల్ అయిన రాజ్ తరుణ్..

దర్శకుడు ఎ.ఎస్ రవికుమార్ చౌదరి డైరెక్షన్‌లో రానున్న ఈ సినిమాను సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు ‘తిరగబడర స్వామి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేయగా, పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను చిత్ర యూనిట్ ప్రారంభించింది. ప్రముఖ ప్రొడ్యూస్ సి.కళ్యాణ్ క్లాప్ ఇవ్వగా, మరో నిర్మాత కెఎస్.రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత పోకూరి బాబూరావు స్క్రిప్ట్‌ను దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరికి అందించారు.

Raj Tarun: వరసగా డజను ప్లాపులు.. డైలమాలో రాజ్ తరుణ్ భవిష్యత్!

ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని, ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకునే మూవీగా ఈ సినిమా వస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి జె.బి సంగీతం అందిస్తుండగా మిగతా నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. మరి ఈ సినిమాతో రాజ్ తరుణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.