Naatu Naatu : ఎన్టీఆర్, చరణ్ స్టెప్పులు కంటే.. ఎలాన్ మస్క్ కారులు వేసిన నాటు నాటు స్టెప్పుకి ఫిదా అయిన రాజమౌళి!

నాటు నాటు (Naatu Naatu) సాంగ్ లో ఎన్టీఆర్ అండ్ చరణ్ ఒకే సింక్ లో స్టెప్పులు వేసి అదరగొడితే, రాజమౌళికి మాత్రం.. వారిద్దరి సింక్ కంటే, ఎలాన్ మస్క్ (Elon Musk) కారులు వేసిన నాటు నాటు స్టెప్పులోని సింక్ తనకి బాగా నచ్చేసిందట.

Naatu Naatu : ఎన్టీఆర్, చరణ్ స్టెప్పులు కంటే.. ఎలాన్ మస్క్ కారులు వేసిన నాటు నాటు స్టెప్పుకి ఫిదా అయిన రాజమౌళి!

Rajamouli tweet on Tesla naatu naatu light show

Updated On : March 21, 2023 / 3:17 PM IST

Naatu Naatu : రాజమౌళి (Rajamouli) ఏ ముహూర్తాన RRR చిత్రాన్ని తెరకెక్కించాడో గాని, రిలీజ్ అయ్యి ఏడాది అవుతున్నా మూవీ గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటున్నాము. ఇక ఆస్కార్ గెలిచుకోవడంతో ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట ఒక ప్రపంచ గీతంలా మారిపోయింది. చిన్న పిల్లలకు గోరుముద్దలు తినిపించాలి అన్నా ‘చందమామ రావే’ అని పాడడం బదులు నాటు నాటు అని పడాల్సి వస్తుంది. వయసు, భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కర్ని ఉర్రూతలూగించిన నాటు నాటు పాటకి ఎన్టీఆర్ (NTR) అండ్ రామ్ చరణ్ (Ram Charan) స్టెప్పులు మరింత జోష్ ని తెచ్చి పెట్టాయి.

Naatu Naatu : టెస్లా కారుల ‘నాటు నాటు’ ఆటకి ఎలాన్ మస్క్ రిప్లై.. RRR రేంజ్ మాములుగా లేదుగా!

ఈ సాంగ్ లో ఇద్దరి హీరోలు ఒకే సింక్ లో స్టెప్పులు వేయించడానికి రాజమౌళి దగ్గర ఉండి చూసుకున్నాడు. అయితే వీరిద్దరి సింక్ కంటే, ఎలాన్ మస్క్ (Elon Musk) టెస్లా కంపెనీ కారులు వేసిన నాటు నాటు స్టెప్పులోని సింక్ తనకి బాగా నచ్చేసిందట. సుమారు 150 టెస్లా (Tesla) కార్స్ తో నాటు నాటు సాంగ్ బీట్ ని హెడ్ లైట్స్ తో సింక్ చేస్తూ లైట్ షో చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఎలాన్ మస్క్ సైతం వీడియో లైక్ చేస్తూ ట్వీట్ చేశాడు. తాజాగా రాజమౌళి కూడా దీని పై రియాక్ట్ అవుతూ ట్వీట్ చేశాడు.

Naatu Naatu : మొన్న కొరియన్, నేడు జర్మన్ ఎంబసీ.. నాటు నాటు పై ఆనంద్ మహేంద్ర ట్వీట్!

”ఇది ఒక అద్భుతమైన ప్రదర్శన. ఈ లైట్ షో చూసి ప్రతి ఒక్కర్ని ఆకట్టుకునేలా ఉంది. నాటు నాటుకి మీరు ఇచ్చిన ఈ ట్రిబ్యూట్ కి నేను నిజంగా పొంగిపోతున్నా” అంటూ ట్వీట్ చేశారు. అలాగే ఆ షో నిర్వహించిన నార్త్‌ అమెరికన్‌ సీమాంధ్ర అసోసియేషన్‌ సభ్యులు వంశీ కొప్పురావూరి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ షో చూడడానికి దాదాపు ఒక 500 మంది హాజరయ్యారు. మరి ఇప్పటివరకు మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూసేయండి.