Beast: బీస్ట్ దెబ్బకు పక్కకు తప్పుకున్న రజినీ..?

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’ రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా....

Beast: బీస్ట్ దెబ్బకు పక్కకు తప్పుకున్న రజినీ..?

Rajinikanth Cancelled Movie With Nelson Dilip Due To Beast Result

Beast: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’ రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ఈ సినిమాలో విజయ్ యాక్షన్ ఓ రేంజ్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ తెరకెక్కించడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు.

Beast: బీస్ట్ చిత్రాన్ని అక్కడి నుండి లేపేశారా..?

అయితే ఈ సినిమా రిలీజ్ రోజునే దారుణమైన నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. రొటీన్ రొట్టకొట్టుడు కథను పట్టుకొచ్చిన నెల్సన్ దిలీప్‌ను విజయ్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ట్రోలింగ్ చేశారు. ఇలాంటి కథ కోసం ఇంత భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించాలా అంటూ ఆయనపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. అయితే ఈ సినిమాకు తమిళనాట విజయ్ ఫ్యాన్స్ పుణ్యమా అని కొంతమేర ఊరట లభించింది. అక్కడ ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే బీస్ట్ చిత్రం రిలీజ్ అయ్యి వారం రోజులు పూర్తయిన క్రమంలో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులెవరూ ముందుకు రావడం లేదు.

దీంతో ఈ సినిమా తమిళనాట కూడా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక బీస్ట్ దెబ్బకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అలర్ట్ అయినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆయన తన నెక్ట్స్ మూవీని నెల్సన్ దిలీప్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే బీస్ట్ రిజల్ట్ చూసిన ఆయన నెల్సన్‌తో సినిమాపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. బీస్ట్ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అయ్యింది. కానీ బీస్ట్ రిజల్ట్‌తో వారు కూడా ఈ సినిమాను పక్కనబెట్టేందుకే మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది.

Beast: ఓటీటీలో బీస్ట్ టైమ్ ఫిక్స్..?

మంచి ఫాంలో ఉన్న విజయ్‌కే నెల్సన్ ఇంతటి డిజాస్టర్‌ను ఇస్తే.. అసలు ఫాంలోనే లేని రజినీకాంత్‌కు ఆయన ఎలాంటి సినిమాను అందిస్తాడో అనే సందేహం మేకర్స్‌లో నెలకొనడంతో వారు ఈ సినిమాను ఇప్పట్లో పట్టాలెక్కించేందుకు ఇష్టంగా లేరని తెలుస్తోంది. మొత్తానికి బీస్ట్ డిజాస్టర్‌తో రజినీకాంత్ కూడా అలర్ట్ కావడంతో ఆయన మరో ఫ్లాప్‌ను మూటగట్టుకోకుండా జాగ్రత్త పడ్డారని ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకుంటున్నారు.