Ramyakrishna : మహేష్-త్రివిక్రమ్ సినిమాలో రమ్యకృష్ణ.. ఏ పాత్రలో?

  సూపర్ స్టార్ మహేశ్ అండ్ త్రివిక్రమ్ కాంబో మూవీకి మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి చాలానే స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈ మూవీ గురించి లేటెస్ట్ గా ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లోని క్రేజీ మూవీ ప్రస్తుతం................

Ramyakrishna : మహేష్-త్రివిక్రమ్ సినిమాలో రమ్యకృష్ణ.. ఏ పాత్రలో?

Ramyakrishna plays a important role in mahesh trivikram SSMB28 Movie

Ramyakrishna :  సూపర్ స్టార్ మహేశ్ అండ్ త్రివిక్రమ్ కాంబో మూవీకి మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి చాలానే స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈ మూవీ గురించి లేటెస్ట్ గా ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లోని క్రేజీ మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ‘అతడు, ఖలేజా’ సినిమాల తర్వాత మరోసారి మహేశ్ అండ్ త్రివిక్రమ్ కలయికలో సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాపై. ఫ్యామిలీ రిలేషన్స్ కు, హ్యూమన్ ఎమోషన్స్ కు తన సినిమాల్లో మంచి స్పేస్ ఇచ్చే త్రివిక్రమ్ ఈ సినిమాలో కూడా అదే ఫాలో అవుతున్నాడు.

తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఇందులో మహేశ్ తల్లిగా రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్ చేస్తోందని సమాచారం. మహేశ్ బాబు గత సినిమా ‘సరిలేరు నీకెవ్వరు లో కూడా ‘విజయశాంతి పవర్ ఫుల్ రోల్ చేసి సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో SSMB 28లో మహేశ్ తల్లిగా రమ్యకృష్ణ నటించడం సినిమాకే ప్రత్యేకమని చెప్పాలి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా అలరించిన రమ్యకృష్ణ ఇప్పుడు తల్లి పాత్రల్లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాలో ప్రభాస్ కి తల్లిగా రమ్యకృష్ణ ఎంతటి సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందో అందరం చూశాం. ఇటీవల లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండకి కూడా తల్లిగా మెప్పించింది.

Ritika Singh : 32 రోజులపాటు తలస్నానం చేయకుండా.. ఒకే డ్రెస్‌తో షూటింగ్ చేసిన రితికా..

ఇప్పుడు మహేశ్ బాబుకి తల్లిగా రమ్యకృష్ణ త్రివిక్రమ్ దర్శకత్వంలో మెప్పించబోతుంది. ఈ వార్త తెలియడంతో మహేశ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్-రమ్యకృష్ణ మధ్య సెంటిమెంట్ సీన్స్ ఎలా పండుతాయి అని ఎదురు చూస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన ఒక ఖరీదైన ఇంటి సెట్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఆగస్ట్ 11న సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ మూవీ టైటిల్ ను ఉగాది రోజున రివీల్ చేయబోతున్నట్టు సమాచారం. రమ్యకృష్ణ అప్డేట్ తో SSMB 28పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.