Animal Movie : పక్కా ప్లానింగ్.. రిలీజ్ డేట్ లాక్..

రణ్‌బీర్ కపూర్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రెస్టీజియస్ ఫిలిం ‘యానిమల్’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు..

Animal Movie : పక్కా ప్లానింగ్.. రిలీజ్ డేట్ లాక్..

Animal Movie

Animal Movie: బాలీవుడ్ యంగ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, ‘అర్జున్ రెడ్డి’ తో టాలీవుడ్‌లో.. ‘కబీర్ సింగ్’ తో బాలీవుడ్‌‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రెస్టీజియస్ ఫిలిం ‘యానిమల్’.

Pushpa Movie : నన్ను కొట్టేటోడు భూమ్మీద పుట్టలేదంటున్న ‘పుష్ప’ రాజ్..

ఇప్పటివరకు కొంత పార్ట్ షూటింగ్ జరుపుకుందీ మూవీ. ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. 2023 ఇండిపెండెన్స్‌డే వీకెండ్‌లో సినిమాను వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదల చెయ్యబోతున్నారు. 2023 ఆగస్టు 11న ‘యానిమల్’ ఫిలింను ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు.

Hrithik-Ranbir : బాలీవుడ్ బిగ్ క్లాష్..

రణ్‌బీర్ నటించిన మల్టీస్టారర్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే శ్రద్ధ కపూర్‌తో కలిసి లవ్ రంజన్ డైరెక్షన్‌లో నటిస్తున్న సినిమా 2023 రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ కాబోతుంది. సందీప్ ఇటీవలే ప్రభాస్ 25వ సినిమా ‘స్పిరిట్’ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎనిమిది భాషల్లో ‘స్పిరిట్’ రిలీజ్ కానుంది.

SPIRIT : ‘స్పిరిట్’ అంటే అర్థం ఇదేనంట..!