Rashmika: మరో బంపరాఫర్ కొట్టేసిన రష్మిక..?

అందాల భామ రష్మిక మందనకు తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆమె తన తొలి తమిళ సినిమాను హీరో విజయ్‌తో కలిసి చేస్తోంది. అయితే ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే, మరో తమిళ స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.

Rashmika: మరో బంపరాఫర్ కొట్టేసిన రష్మిక..?

Rashmika Mandanna Bags Another Crazy Offer In Tamil

Rashmika: కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప-ది రైజ్ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది. దీంతో భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల దర్శకనిర్మాతలు ఆమె కోసం క్యూ కడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటిన ఈ బ్యూటీ, ఇప్పుడు తమిళంలో స్టార్ హీరో విజయ్ సరసన ‘వారసుడు’ అనే సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు మలయాళ హీరో దుల్కర్ సాల్మన్‌తో ‘సీతా రామం’, బాలీవుడ్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా, అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్‌లతో కలిసి సినిమాలు చేస్తోంది ఈ చిన్నది.

Rashmika Mandanna: రెడ్ డ్రెస్‌లో అందాల ఆరబోత.. రష్మిక ట్రీట్ అదిరిందిగా!

అయితే ఇప్పటికే చేతినిండా సినిమాలతో యమబిజీగా మారిన రష్మికకు మరో బంపరాఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. తమిళంలో తొలి సినిమాను విజయ్‌తో కలిసి చేస్తోన్న రష్మిక, తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా మరో స్టార్ హీరోతో చేసేందుకు రెడీ అవుతోందట. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్, దర్శకుడు పా రంజిత్‌ల కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇదే విషయంపై చిత్ర యూనిట్ రష్మికను సంప్రదించగా, ఆమె కూడా విక్రమ్‌తో కలిసి నటించేందుకు ఓకే చెప్పేసినట్లుగా కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Rashmika Mandanna : పొట్టి బట్టలతో మరోసారి ఇబ్బంది పడ్డ రష్మిక.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఇక రష్మికకు తమిళంలో కూడా ఎదురులేదనే చెప్పాలి. ఇప్పటికే పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ, తెలుగులో పుష్ప-2 సినిమా కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది. ఏదేమైనా వరుస ఆఫర్లతో యావత్ సినీ ఆడియెన్స్‌ను తనవైపు తిప్పుకుంటున్న ఈ బ్యూటీ, తన పర్ఫార్మెన్స్‌తో పాటు అందాల ఆరబోతతోనూ వారిని కట్టిపడేస్తోంది.