Rashmika Mandanna : ఆ ఫ్లాప్ సినిమా రష్మికకు చాలా స్పెషల్ అంట.. విజయ్ దేవరకొండ, డైరెక్టర్‌కి థ్యాంక్స్ చెప్తూ స్పెషల్ పోస్ట్..
డియర్ కామ్రేడ్ సినిమా 2019 జులై 29న రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజయి నిన్నటికి నాలుగేళ్లు అవ్వడంతో నిన్న సాయంత్రం రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది.

Rashmika Mandanna special post on Dear Comrade Movie for completing four Years
Rashmika Mandanna : విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా వచ్చిన రెండో సినిమా డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు రిలీజ్ ముందు చాలా హైప్ ఉంది. సాంగ్స్ హిట్ అవ్వడం, ఆల్రెడీ రష్మిక, విజయ్ గీత గోవిందంతో హిట్ కొట్టడంతో డియర్ కామ్రెడ్ పై చాలా అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా ప్రేక్షకులని థియేటర్స్ లో నిరాశపరిచింది. సినిమా చాలా ల్యాగ్ ఉండటం, రొటీన్ లవ్ సీన్స్, లాస్ట్ లో రొటీన్ హరాజ్మెంట్ కేసుతో నడిపించడం.. ఇవన్నీ ప్రేక్షకులని, విజయ్ ఫ్యాన్స్ ని నిరాశపరిచాయి. కలెక్షన్స్ కూడా రాక ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ చూసింది.
అయితే ఈ సినిమా సాంగ్స్, సాంగ్స్ విజువల్స్ మాత్రం అందర్నీ మెప్పించాయి. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్ కి ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ చేసి నాలుగేళ్లు అయినందుకు రష్మిక స్పెషల్ పోస్ట్ చేసింది. డియర్ కామ్రేడ్ సినిమా 2019 జులై 29న రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజయి నిన్నటికి నాలుగేళ్లు అవ్వడంతో నిన్న సాయంత్రం రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది.
విజయ్ దేవరకొండ, డైరెక్టర్ భరత్ కమ్మతో కలిసి దిగిన సెల్ఫీ పోస్ట్ చేసి.. నాకు లైఫ్ లో చాలా స్పెషల్ ఫిలిం డియర్ కామ్రేడ్. ఈ సినిమాకు నాలుగేళ్లు. విజయ్, భరత్ థ్యాంక్యూ.. అంటూ విజయ్‌ని, భరత్ ని ట్యాగ్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ ఫ్లాప్ సినిమా రష్మికకు స్పెషలా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు.