Rashtrapati Bhavan: సందర్శకులకు అందుబాటులోకి రానున్న రాష్ట్రపతి భవన్ గార్డెన్.. మార్చి 26 వరకు అవకాశం

రాష్ట్రపతి భవన్ పరిధిలోని అనేక ఉద్యానవనాల్ని సాధారణ ప్రజలు సందర్శించేందుకు అనుమతిస్తారు. ప్రతి సంవత్సరం కొద్ది రోజులపాటు ఇలా ఇక్కడి ఉద్యానవనాల్ని సందర్శించే అవకాశం కల్పిస్తారు. దీనిలో భాగంగా ఈ నెల 31 నుంచి మార్చి 26 వరకు అందరూ సందర్శించవచ్చు.

Rashtrapati Bhavan: సందర్శకులకు అందుబాటులోకి రానున్న రాష్ట్రపతి భవన్ గార్డెన్.. మార్చి 26 వరకు అవకాశం

Rashtrapati Bhavan: ఢిల్లీ, రాష్ట్రపతి భవన్‌లో ఉన్న ఉద్యానవనం సందర్శకులకు అందుబాటులోకి రానుంది. ఈ నెల 31 నుంచి మార్చి 26 వరకు సందర్శకులు ఈ గార్డెన్‌ను చూసే వీలుంటుంది. ‘ఉద్యాన్ ఉత్సవ్-2023’ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ప్రారంభించారు.

Gujarat: పంచాయత్ జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ పేపర్ లీక్.. పరీక్ష రద్దు చేసిన ప్రభుత్వం

దీనిలో భాగంగా రాష్ట్రపతి భవన్ పరిధిలోని అనేక ఉద్యానవనాల్ని సాధారణ ప్రజలు సందర్శించేందుకు అనుమతిస్తారు. ప్రతి సంవత్సరం కొద్ది రోజులపాటు ఇలా ఇక్కడి ఉద్యానవనాల్ని సందర్శించే అవకాశం కల్పిస్తారు. దీనిలో భాగంగా ఈ నెల 31 నుంచి మార్చి 26 వరకు అందరూ సందర్శించవచ్చు. అదనంగా మార్చి 28 నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక విభాగాలకు చెందిన వారిని కూడా అనుమతిస్తారు. మార్చి 28న రైతులకు, మార్చి 29న దివ్యాంగులకు, మార్చి 30న భద్రతా దళాలు, పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు, మార్చి 31న మహిళలు, ఆదివాసీ మహిళలు, గిరిజనులు, స్వయం సహాయక బృందాల వారికి కూడా అనుమతి ఉంటుంది.

Karnataka: అంతరించిపోతున్న జీవుల అక్రమ రవాణా.. ఎయిర్‌పోర్టులో 18 జీవుల స్వాధీనం.. నిందితుల అరెస్ట్

ప్రతి రోజూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సందర్శనకు అనుమతి ఉంటుంది. దీనికి అనుగుణంగా అధికారులు గార్డెన్లను మరింత సుందరంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడి మొఘల్ గార్డెన్ పేరును ‘అమృత్ ఉద్యాన్‌‌‌‌‌‌’గా మార్చారు. ఈ ఉద్యానవనంలో ఎక్కువ మందిని ఆకర్షించేవి గులాబి పూలు. ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యలో 159 రకాల పూలు పూస్తాయి. ఇందులో అడోరా, మృణాళిని, తాజ్ మహల్, ఈఫిల్ టవర్ వంటి అనేక రకాల గులాబీల్ని పెంచుతారు.

కొన్ని గులాబీ రకాలకు జవహర్ లాల్ నెహ్రూ, క్వీన్ ఎలిజబెత్, క్రిస్టియన్ డియారో వంటి పేర్లు పెట్టారు. వీటితోపాటు ఈ ఏడాది టులిప్ పూలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 12 రకాల అరుదైన టులిప్ పూలను ఇక్కడ పెంచుతున్నారు. సందర్శకులు తమ స్లాట్‌లను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.